https://oktelugu.com/

Hair Falls : జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసా? తెలిస్తే పరిష్కారం కూడా సులభమే..

ఐరన్, జింక్, బయోటిన్ ప్రొటీన్లు తగినంతగా తీసుకోనప్పుడు జుట్టు రాలడం మరింత పెరుగుతుంటుంది. ఈ పోషకాలను మీరు మల్లీ తీసుకుంటే మీ జుట్టు సేఫ్.

Written By:
  • NARESH
  • , Updated On : May 22, 2024 2:59 pm
    Follow us on

    Hair Falls : జుట్టు రాలడం సర్వసాధారణంగా అందరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్య కొందరిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికోసం ఎన్నో షాంపూలు, కండీషనర్లు, ఆయిల్స్ ను వాడుతుంటారు. ఖరీదైన వీటి వల్ల ఎలాంటి లాభం కూడా ఉండదు. అయితే ఈ జుట్టు రాలడానికి కారణం తెలుసుకుంటే వాటికి పరిష్కారం కనుగొనడం ఈజీ అవుతుంది. మరి జుట్టు రాలడానికి కారణాలు ఏంటో ఓ సారి చూద్దామా..?

    జుట్టు రాలడం హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వల్ల సంభవిస్తుంటుంది. రెండూ రసాయన అసమతుల్యత వల్ల ఏర్పడుతుంటాయి. అయితే థైరాయిడ్ హార్మోన్లు జుట్టు పెరుగుదలతో సహా అనేక శారీరక విధుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అంటారు నిపుణులు. ఈ థైరాయిడ్ రుగ్మతలకు సరైన చికిత్స తీసుకుంటే, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయట. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు కొత్త జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది.

    అధికంగా ఒత్తిడి ఉన్నా లేదంటే ఏవైనా బలమైన గాయాలు తగిలినా కూడా జుట్టు పెరుగుదల సహజ చక్రానికి అంతరాయం కలిగుతుంది. ఇది జుట్టు రాలడానికి లేదా జుట్టు పల్చబడటానికి దారితీస్తుంది. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటివి జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తాయి . దీంతో జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది.

    జుట్టు రాలడానికి మరొక సర్వసాధారణమైన సమస్య వయస్సు-సంబంధిత జన్యుపరమైన రుగ్మత. చాలా మంది పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలుతుంటుంది. ఇక జుట్టు పెరుగుదలకు , బలానికి పోషకాలు అవసరం. కొన్ని విటమిన్లు మినరల్స్ లోపిస్తే జుట్టు రాలడం జుట్టు పెరుగుదల నెమ్మదించడం వంటివి సంభవిస్తాయి. ఐరన్, జింక్, బయోటిన్ ప్రొటీన్లు తగినంతగా తీసుకోనప్పుడు జుట్టు రాలడం మరింత పెరుగుతుంటుంది. ఈ పోషకాలను మీరు మల్లీ తీసుకుంటే మీ జుట్టు సేఫ్.