Laxmi Devi Potrait
Laxmi Devi Potrait: హిందువులు పూజించే దేవతమూర్తులలో లక్ష్మీ దేవి ఒకరు. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో, దుకాణాలలో ఉంచుకొని మరి పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఆర్థికంగా బలంగా ఉంటారు. అంతేకాకుండా ఆయురారోగ్యాలు కూడా బాగుంటాయి. మామూలుగా అందరి ఇళ్ళల్లో లక్ష్మీ అమ్మవారు వివిధ అవతారాలతో కనిపిస్తూ ఉంటుంది.
అందులో విష్ణుమూర్తి కాళ్ల దగ్గర కూర్చున్న ఫోటో, తామర పువ్వు పై కూర్చున్న ఫోటో, అంతేకాకుండా వాహన గరుత్మంతుడి పై ఉన్న ఫోటో ఇలా రకరకాలుగా లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. అలా అటువంటి ఫోటోలో ఉన్న అమ్మవారిని పూజించడం వల్ల మనకు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ లక్ష్మీ అమ్మవారిది మరో అవతారం తో ఉన్న ఫోటో ఉన్నట్లయితే ఆర్థికంగా సమస్యలు రావడం ఖాయమని కొన్ని శాస్త్రాలు తెలుపుతున్నాయి.
అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, తరచూ గొడవలు వంటివి జరుగుతుంటాయని తెలుస్తుంది. నిజానికి ఎవరైనా అమ్మవారి విగ్రహాలను లేదా ఫోటోలను కొనేటప్పుడు తమకు నచ్చిన ఫోటోలను తీసుకుంటారు. కానీ ఆ ఫోటోలో ఉన్న అమ్మవారి అవతారాలు గమనించరు. దానివల్ల ఇంట్లోకి అమ్మవారిని తీసుకొచ్చి పూజలు చేయటం ప్రారంభించిన కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మంచి జరగదు.
ఎందుకంటే తీసుకొచ్చిన ఫోటోలో ఏదైనా ఉండరానిది ఉన్నట్లయితే అది మనకు కీడు. ఇంతకీ అది ఏ అవతారము అంటే.. లక్ష్మీ అమ్మవారు గుడ్లగూబ పై కూర్చున్న అవతారం. ఈ అవతారం లో ఉన్న అమ్మవారి ఫోటోలు క్షణం కూడా ఇంట్లో ఉంచకూడదని.. అసలు ఆ ఫోటో జోలికి వెళ్లకూడదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అలా ఉన్నట్లయితే ఇంట్లో మొత్తం నష్టాలే జరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఈ అవతారంతో ఉన్న ఫోటో ఉన్నట్లయితే వెంటనే తీసివేయండి.