Financial freedom tips: కాలం మారుతున్న కొద్దీ వ్యక్తుల తలసరి ఆదాయం పెరిగిపోతుంది. ఒకప్పుడు వందల రూపాయలు ఉన్న జీతాలు ఇప్పుడు వేల రూపాయలకు మారిపోయాయి. ఒకప్పుడు లక్షల్లో ఆదాయం వచ్చిన వ్యాపారులు ఎప్పుడూ కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. అయినా కూడా చాలామంది అప్పుల్లో ఇరుకుంటున్నారు. అందుకు కారణం విపరీతమైన ఖర్చులే అని చెప్పవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరగడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు అప్పు చేయడానికి ఎలాంటి మార్గం లేదు. కానీ ఇప్పుడు అప్పు చేయడానికి అనేక మార్గాలు ఉండడంతో చాలామంది అప్పులు తీసుకుంటున్నారు. కానీ వీటిని తీర్చడానికి అనేక అవస్థలు పడుతున్నారు. అయితే ఎన్నో రకాలుగా వేధిస్తున్న అప్పులు తీరడానికి ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే పరిష్కారం అవుతుందని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని చేసినా సాధ్యం కాదు. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే అప్పుల విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. ఎంత ఆదాయం వచ్చినా నెగటివ్ ఎనర్జీతో అప్పులు పెరుగుతాయి. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొడితే అప్పుడు తీరే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో దొరికే ఈ కొన్ని వస్తువులతో చిన్న టెక్నిక్ పాటిస్తే అనుకున్న పలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకోసం కొన్ని బియ్యం, మూడు లేదా నాలుగు కాయిన్స్, ఒక పేపర్, ఏడు లవంగాలు, ఒక పెన్, కొన్ని వాటర్, ఒక జార్ లేదా సీసం కలిగిన బాక్స్ తీసుకోవాలి. ముందుగా జార్ లో బియ్యం పోయాలి. ఆ తర్వాత లవంగాలు వేయాలి. ఇప్పుడు ఇందులో కాయిన్స్ వేసి.. చివరగా నిండుగా నీరు పోయాలి. ఇలా మిశ్రమం చేసిన జార్ లేదా బాటిల్ ను ఎవరు టచ్ చేయని ప్రదేశంలో ఇంట్లో ఉంచుకోవాలి. వీలైతే బెడ్ పడుకున్న తర్వాత తల వెనకాల ఉన్న ప్రదేశంలో ఉంచుకోవచ్చు. ఇలా ఏడు రోజులపాటు ఒకే ప్రదేశంలో ఉంచి.. ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ తో సహా మొత్తం ఒక చెట్టు లేదా ఎవరు నడవని ప్రదేశంలో పోయాలి. అందులో ఉన్న కాయిన్స్ ను ఇతరులకు దానం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి.. అప్పుడు తీరే అవకాశం ఉంటుంది.
అయితే పూర్వకాలంలో రైతులు పంట కోసిన తర్వాత వడ్ల గింజలను వేలాడదీసేవారు. అంటే ధాన్యం అనేది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటకు పంపి.. పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు మాయమై పోతాయి. అందువల్ల అప్పులతో సతమతం అయ్యేవారు ఈ టెక్నిక్ పాటిస్తే ఫలితం ఉండే అవకాశం ఉంది.