Covid 19 Health Tips: మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. ఫలితంగా రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మనం తీసుకునే ఆహారమే మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో కరోనా సమయంలో అందరు విధిగా మంచి ఆహారాలు తీసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా కరోనా రక్కసి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మన రోగ నిరోధక శక్తినిపెంచే ఆహారాలపై శ్రద్ధ చూపుతున్నారు. కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలను గుర్తించుకుని మంచి వాటిని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.

రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని అడ్డుకునేవి కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. సోడా మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినేలా చేస్తుంది. ఫ్లూ సమస్యలు వ్యాపించేలా చేస్తుంది. ీంతో సోడా తాగడం అంత మంచిది కాదు. రోగనిరోధక వ్యవస్థను పెంచే ఆహారాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్బంలో సోడా తీసుకుంటే ప్రమాదమే. ఇంకా ధూమపానం వల్ల కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గిస్తుంది. అందుకే పొగతాగే అలవాటు ఉంటే తక్షణమే మానుకోవడం ఉత్తమం.
మద్యపానంతో కూడా ఎన్నో నష్టాలు ఉన్నాయి. అయినా ఎవరు తగ్గడం లేదు. సాయంత్రం అయిందంటే చాలు అందరు గ్లాసులు పుచ్చుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మందు తాగడం వల్ల కాలేయం చెడిపోతుంది. రోగ నిరోధక వ్యవస్థ మందగిస్తుంది. అలా అయితే మన శారీరక బలం బద్దకస్తుంది. రోగాలు చుట్టు ముట్టే అవకాశం పెరుగుతుంది. అందుకే మందును సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడమే ఉత్తమం. దీని కోసం అందరు ప్రయత్నించడం మంచిది.

మైదాపిండితో కూడా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. బేకరీ ఫుడ్స్ లో ఎక్కువగా వాడే మైదాతో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా మంది బేకరీ ఫుడ్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటిని తినేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కూడా రోగ నిరోధక వ్యవస్థ పాడవుతుంది. మైదా పేగులను దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి దూరంగా ఉంటేనే మేలు. కరోనా ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తున్న సందర్భంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలే అని తెలుసుకోవాలి.