
Alcohol Side Effects: మనదేశంలో మద్యపానం అలవాటు సహజం. మద్యం ప్రియులు ఏదో ఓ వంకతో మద్యం తాగుతుంటారు. అది సుఖమైనా దుఖమైనా కష్టమైనా సంతోషమైనా మద్యంతోనే షేర్ చేసుకోవడం ఫ్యాషన్ గా మారింది. ఏదో సాకుతో మద్యం తాగేయడం పరిపాటిగా చేసుకుంటున్నారు. మద్యానికి బానిసలం కాదని అప్పుడప్పుడు లిమిటెడ్ గా తాగుతుంటామని సర్ది చెప్పుకుంటారు. అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. మందు తాగాలని ఉబలాటపడుతుంటారు. ఇదే చాన్స్ గా మద్యం లాగించేస్తారు. దానికి ఏదో ఒక కారణం చూపి తాగుతుండటం ఓ వ్యసనంగా చూసుకుంటున్నారు
అల్కాహాల్ వల్ల..
అల్కాహాల్ వల్ల ఏం లాభం? దాన్ని తాగడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయా? ఊరికే అలవాటు ప్రకారమే తాగుతారా? అంటే అది ఒక అలవాటుగా చేసుకున్నారు. దాని వల్ల వన్ పర్సంట్ కూడా ఆరోగ్యం ఉండదు. ఇంకా దీని వల్ల లివర్ పాడైపోతుంది. త్వరగా చనిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అమెరికాలో దాదాపు 1.40 లక్షల మంది మద్యం తాగి చనిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇందులో లివర్, క్యాన్సర్, గుండెపోటు వంటి రోగాలతోనే ఎక్కువ మంది మృత్యువాత పడినట్లు ఆధారాలు చెబుతున్నాయి.
పరిమితిలోనే..
ఇటీవల కొందరు తాము లిమిట్ గా తాగుతున్నామని చెబుతున్నారు. ఒక పెగ్గుతోనే సరిపెట్టుకుంటున్నామని సర్ది చెప్పుకుంటున్నారు. కానీ ఇది కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మితమైన మోతాదులో తీసుకుంటున్నా ఆరోగ్యానికి హానికరమే అని పరిశోధనల్లో తేలుతోంది. మద్యం తాగడంపై దశాబ్ధాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. అల్కాహాల్ ఆరోగ్యానికి ప్రమాదమే అని కొత్త పరిశోధన సారాంశం. దీంతో మద్యం ప్రియులు మద్యం తీసుకోకుండా ఉండటమే మంచిది.
ఆందోళన కలిగిస్తున్న పరిశోధనలు
అమెరికాలోని విక్టోరియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ టిమ్ అల్కాహాల్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తేల్చారు. పురుషులు రోజుకు రెండు గ్లాసులు, మహిళలు రోజుకు ఒక గ్లాసు మద్యం తీసుకున్నా దాంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలియజేస్తున్నారు. అల్కహాల్ మానవ డీఎన్ఏను దెబ్బతీస్తుంి. అల్కహాల్ తీసుకున్నప్పుడు శరీరం ఎసిటిక్ యాసిడ్ గా విడదీసి డీఎన్ఏ పాడు కావడానికి దోహదపడుతుంది. డీఎన్ఏ దెబ్బతిన్న తరువాత కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి.

నిర్లక్ష్యం వీడాల్సిందే?
మద్యం తాగడం వల్ల అనేక రోగాలు పొంచి ఉంటాయి. అది మన ఆరోగ్య వ్యవస్థ మొత్తం ఖరాబు చేస్తుంది. మద్యం తాగడం మంచి అలవాటు కాదని అందరికి తెలిసినా పట్టించుకోవడం లేదు. వ్యాధులు చుట్టుముడతాయని అవగాహన ఉన్నా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. ఫలితంగా డీఎన్ఏ పై ప్రభావం చూపి మన శారీరక వ్యవస్థనే దెబ్బతీస్తుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. సో మద్యం ప్రియులు మద్యం తాగే అలవాటుకు దూరంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.