https://oktelugu.com/

Best Drinks: ఈ డ్రింక్స్ తాగితే శరీరంలో కొవ్వు, వ్యర్థాలు మాయం..అవి ఏంటంటే..!!

శరీరం లోపల ఉన్న వ్యర్థాలను తొలగించుకోకపోతే .. ఆ వ్యర్థాలన్నీ పేరుకుపోయి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మన బాడీలో ఉన్న ఈ వ్యర్థాలను ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 30, 2024 5:44 pm
    Best Drinks

    Best Drinks

    Follow us on

    Best Drinks: సాధారణంగా మనమంతా శరీరంపై ఉన్న మురికి, మలినాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉంటాం. ఇందుకోసం క్రమం తప్పకుండా స్నానం చేస్తాం. శరీరంపై ఉన్న మలినాల కోసం ఆలోచిస్తాం కానీ ఎప్పుడూ శరీరం లోపలి వ్యర్థాల గురించి అంతగా పట్టించుకోం. అయితే శరీరం లోపలి వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

    శరీరం లోపల ఉన్న వ్యర్థాలను తొలగించుకోకపోతే .. ఆ వ్యర్థాలన్నీ పేరుకుపోయి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మన బాడీలో ఉన్న ఈ వ్యర్థాలను ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.

    మన శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ ను తొలగించుకోవడానికి కొన్ని డ్రింక్స్ సహాయపడతాయని తెలుస్తోంది. వాటిలో ముందుగా గ్రీన్ జ్యూస్.. ఇది ఎఫెక్టివ్ డిటాక్స్ డ్రింక్ గా సహాయపడుతుంది. తాజా ఆకుకూరలు మరియు కూరగాయల తో దీన్ని తయారు చేస్తారు. ఈ గ్రీన్ జ్యూస్ లో మినరల్స్, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు కాలుష్య కారకాల నుంచి ఊపిరితిత్తులను సంరక్షిస్తాయట. అలాగే ఈ జ్యూస్ లో ఉండే విటమిన్ కే చర్మ ఆరోగ్యానికి మంచిది.

    తరువాత కొబ్బరి నీళ్లు.. శరీరాన్ని హైడ్రేటింగ్ ఉంచేందుకు కొబ్బరి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఊపిరితిత్తులతో సహా బాడీలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజూ కొబ్బరి నీళ్లను తాగడం వలన ఊపిరితిత్తులు డిటాక్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీని హైడ్రేటింగ్ లక్షణాలు శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపేందుకు తోడ్పడతాయి.

    గోల్డెన్ మిల్క్.. గోరు వెచ్చగా ఉన్న పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగడం వలన శరీరంలో ఉన్న వ్యర్థాలు, టాక్సిన్స్ తొలగుతాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తులను డిటాక్స్ చేయగా.. అందులోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.

    గ్రీన్ టీ.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో వాపును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ వలన కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తులను కాపాడుతుంది.