
Papaya Leaf Benefits: ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే జుట్టు రాలడం, తెల్ల బడటం సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో నలుగురిలో నడవాలంటేనే సిగ్గుగా భావిస్తున్నారు. యవ్వనంలోనే ముసలి వారులా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఏవేవో రంగులు వేస్తూ కాలం గడుపుతున్నారు. కానీ రంగుల వల్ల ఇతర ఇబ్బందులు వస్తాయని తెలిసినా తప్పని పరిస్థితుల్లో వేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కానీ ఇబ్బందులు రావడం ఖాయం. ఈ క్రమంలో మరి మన జుట్టును బాగు చేసుకోవాల్సిన ఇతర మార్గాలేమిటని అందరు ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడో 50-60 ఏళ్లకు తల నెరిసిపోయేది. జుట్టు ఊడిపోయేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఇవన్ని కనిపిస్తున్నాయి. దీనికి కారణం మనం తీసుకునే ఆహారాలే కావడం గమనార్హం. తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నా వాటిని పాటించడం లేదు. రెండు బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.
అందులో నాలుగు బిర్యానీ ఆకులు వేసి ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకుని బాగా మరిగించి వడకట్టుకోవాలి. ఒక పాత్రలో కర్ణ పౌడర్ తీసుకుని బొప్పాయి ఆకుల రసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. తరువాత కాఫీ పొడితో చేసిన మిశ్రమాన్ని పేస్టులా కలుపుకోవాలి. దీన్ని ఒక కడాయిలో వేసి రాత్రంతా మూత పెట్టి ఉంచి తరువాత జుట్టుకు రాసుకుంటే ఫలితం వస్తుంది. ఇలా ఈ సులభమైన చిట్కాను పాటించి తెల్ల జుట్టును నల్లగా చేసుకోవడం మంచిది.

ప్రస్తుత కాలంలో అందరు హెయిర్ డై వాడుతున్నారు. దీంతో సైడ్ ఎఫెక్టులు ఉంటాయని గుర్తించడం లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ లో ఇంకా ముప్పు ఏర్పడుతుంది. అందుకే ఆయుర్వేదంలో చెప్పినట్లు చెట్లతో తయారు చేసుకున్న మందులు వాడుకోవడమే ఉత్తమం. మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోకుండా రక్షించుకోవాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంది. దీన్ని అందరు పాటించి తమ జుట్టును నల్లగా చేసుకుని ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకోవడం సులభం.