Stolen Phone: ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు పర్సనల్ అవసరాలతో పాటు కార్యాలయాల విధులకు సంబంధించిన పనులు మొబైల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కోసారి తొందరపాటు వల్ల మొబైల్ ను మరిచిపోతుంటారు. మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఫోన్ ను వేరేవాళ్లు దొంగిలిస్తుంటారు. ఎవరైనా ఫోన్ దొంగిలించిన వెంటనే ఫస్ట్ స్విచ్ఛాప్ చేస్తారు. కొన్ని రోజుల పాటు ఇలా స్విచ్ఛాప్ చేసిన తరువాత సిమ్ మార్చడం, తదితర పనులు చేస్తుంటారు. అయితే మొబైల్ లో చిన్న ట్రిక్ ద్వారా దొంగిలించిన ఫోన్ స్విచ్ఛాప్ కాకుండా చేయొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..
మొబైల్ ను ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా..దొంగల బారిన పడుకుండా ఉండడం లేదు. ఒకప్పుడు ఫోన్ దొంగిలించబడితే అస్సలు దొరికేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ రావడంతో మొబైల్ ఎక్కడున్నా ట్రేస్ చేయవచ్చు. అయితే అందుకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ దొంగిలించబడితే చోరులు ముందుగా మొబైల్ ను స్విచ్ఛాప్ చేస్తుంటారు. దీంతో ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం. అయితే ఒక ట్రిక్ ద్వారా అసలు మొబైల్ ను స్విచ్ఛాప్ కాకుండా చేయొచ్చు.
ఇందుకోసం ముందుగానే మొబైల్ లో సెట్టింగ్స్ మార్చుకోవాలి. మొబైల్ లోని Settings లోకి వెళ్లాలి. ఆ తరువాత Password And Security లోకి వెళ్లాలి. ఇక్కడ System Security అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు Requid Password Power Off అనే ఆప్షన్ వస్తుంది. ఇందులోకి వెళ్లిన తరువాత వచ్చిన ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి.దీనిపై ఉన్న Find My Device అనే ఆప్షన్ ను కూడా ఆన్ చేయాలి. ఇప్పుడు మీరు అనుకుంటున్న సెట్టింగ్స్ కంప్లీట్ అవుతుంది.
ఈ సెట్టింగ్స్ మార్చుకున్న తరువాత ఫోన్ ను ఎవరు దొంగిలించినా దానిని స్విచ్ఛాప్ చేయలేరు. ఆ సమయంలో వారికి పాస్ వర్డ్ అడుతుంది. అందువల్ల ఈ విధంగా పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్ ఎక్కడుందో వెంటనే ట్రేస్ చేయొచ్చు. ఆ తరువాత దొంగనువ వెంటనే పట్టుకోవచ్చు. మొబైల్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.