https://oktelugu.com/

Health Tips: ఎక్కువ రోజులు నిద్రకు దూరమైతే ఈ జబ్బులు తెచ్చుకున్నట్లే..

మానవ శరీరంలో ప్రతి పార్ట్ ముఖ్యమే. అన్నీ సక్రమంగా ఉంటేనే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఇందు కోసం సరైన ఆహారం తీసుకోవడంతో పాటు కనీస గంటలు నిద్రపోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 8, 2024 / 02:45 PM IST

    sleeping timings

    Follow us on

    Health Tips: కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిదీ బిజీ లైఫ్ అవుతోంది. దీంతో అనేక ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా పనులు చేస్తూ నిద్రకు దూరమవుతున్నారు. ప్రతి మనిషికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ఒక వ్యక్తి రోజంతా చేసిన పనికి రిలాక్స్ కావడానికి నిద్ర సహకరిస్తుంది. కనీస సమయం నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు రిలాక్స్ అయి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. కానీ కొందరు విధుల గురించి మరికొందరు ఇతర అలవాట్ల గురించి నిద్రకు దూరమవుతున్నారు. 18 ఏళ్లు దాటిన వారు కంటిన్యూగా నిద్రకు దూరమైతే అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎక్కువ కాలం నిద్రకు దూరమైతే ఏం జరుగుతుంతో తెలుసా?

    మానవ శరీరంలో ప్రతి పార్ట్ ముఖ్యమే. అన్నీ సక్రమంగా ఉంటేనే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఇందు కోసం సరైన ఆహారం తీసుకోవడంతో పాటు కనీస గంటలు నిద్రపోవాలి. 4 నెలల నుంచి 12 నెలల వయసు ఉన్న పిల్లలు 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలి. 2 సంవత్సరాల లోపు వారు 11 నుంచి 14 గంటల పాటు పడుకోవాలి. 5 సంవత్సరాల లోపు వారు 13 గంటల పాటు నిద్రించాలి. 12 గంటల లోపు వారు 12 గంటల పాటు నిద్రపోవాలి. 18 సంవత్సరాల లోపు వారు 10 గంటలు నిద్రపోవాలి. 18 సంవత్సాల నుంచి ఆ పై వయసు ఉన్న వారు కనీసం 8 గంటల పాటు నిద్రించాలి.

    శరీరానికి కనీస నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. క్రమంగా నిద్రకు దూరమైతే ముందుగా మానసిక ఆందోళన పెరుగుతుంది. ఈ ప్రభావం గుండెపై పడుతుంది. ఇలా కంటిన్యూగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల గుండె సమస్యలు పెరిగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. శరీరానికి నిద్ర కరువవడంతో కణాల్లోకి గ్లూకోజ్ సరిగా చేరదు. దీంతో కొలెస్ట్రాల్ అధికంగా పెరిగి బరువు పెరుగుతారు. ఈ క్రమంలో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఇదే క్రమంలో పెరాల్సిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుస్తారు.

    అందువల్ల ఎన్ని పనులున్నా కనీసం నిద్రపోవడానికి ప్రయత్నించాలి. రాత్రి సమయంలో విధులు నిర్వహించేవారు నిద్రకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరు ప్రణాళిక ప్రకారంగా స్లీపిండ్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవాలి. రోజూ కుదరకపోతే కనీసం రెండు మూడు రోజులకు ఒకసారైనా 7 నుచి 8 గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.