Goddess Lakshmi: స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు.. ఎందుకంటే ఒక ఇంటి సుఖసంతోషాలు ఆడవారి చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వారికి అమ్మవారి దర్జాను కలిగిస్తారు. అయితే మహిళలు పొరపాటున కూడా ఈ నియమాలు పాటించకపోతే ఆ ఇంట్లో సుఖశాంతురు నిలవవు ..అదే తప్పకుండా వారు ఇటువంటి నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లడమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి.
భర్త ప్రేమ పొందడం, పిల్లాపాపలు కలగడం, ఇంట్లో ఎప్పుడు ఆయురారోగ్యాలు వర్ధిల్లడం… లాంటివి కలుగుతాయి. మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందామా..! చాలామంది స్త్రీలకు మెడలో వేసుకునే మంగళసూత్రానికి పిన్నీసులను పెట్టడం అలవాటు. చీరకు వేసుకునే పిన్నులు.. గబుక్కున తీసుకోవడానికి పనికొస్తాయి అని ఉద్దేశంతో చాలామంది ఇలా చేస్తుంటారు. కానీ పిన్ను అనేది ఇనుముకు సంకేతం…అలా మంగళసూత్రానికి ఇనుము వేయడం వల్ల భర్త ఆరోగ్యం పాడవడంతో పాటు భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అని చెబుతారు.
వేదమంత్రాలు, మంగళవాద్యాలు సాక్షిగా భర్త ఆయూని సూత్రంగా చేసి భార్య మెడకు కట్టేదాన్ని మంగళసూత్రం అంటారు. మరి అలాంటి సూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మంగళసూత్రానికి ఎంతో శక్తి ఉంటుంది. అలాంటి సూత్రాని చాలామంది కంఫర్ట్ గా లేదు అని చెబుతూ తీసి పక్కన పెడుతుంటారు. ఇది చాలా తప్పు. అలాగే చేతికి మట్టి గాజులు ధరించడం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం చాలామంది అయితే మెటల్ గాజులు లేకపోతే బోసి చేతులతో తిరుగుతారు. మట్టి గాజులు ఐశ్వర్యానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు సూచిక. కాబట్టి ఎప్పుడూ చేతికి ఎరుపు లేక ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం శుభప్రదం.
చాలామంది ఇంట్లో అలంకరణగా ఉంటుంది అని పరిగెత్తే గుర్రపు బొమ్మలు పెడుతూ ఉంటారు. ఇలా వేగంగా పరిగెత్తే గుర్రం బొమ్మలు పెట్టడం వల్ల ఇంట్లో ధనం కూడా అంతే వేగంగా ఖర్చవుతుంది. కాబట్టి అటువంటి గుర్రపు బొమ్మలు ఇంట్లో పెట్టకూడదు. బయటకు వెళ్లే సమయంలో భార్య వీలైనంత తక్కువగా అలంకరించుకొని వెళ్లాలని చెబుతారు. లేకపోతే నర దిష్టి తగులుతుంది. కోపంగా ఉన్నప్పుడు అస్సలు వంట జోలికి వెళ్ళకండి. ఇలా కోపంతో వండిన అన్నం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. సుచిగా స్నానం చేసి ప్రశాంతంగా దైవ నామస్మరణ చేస్తూ వంట చేయడం వల్ల తిన్నవారికి రుచితో పాటు ఆరోగ్యం కలుగుతుంది.