Ganesha Pooja: ఆది దేవుడిగా పిలుచుకునే గణనాథుడికి ఎక్కడైనా మొదటి పూజ ఉంటుంది. విఘ్నేశ్వరుడి పూజ పూర్తయిన తరువాతే ఎంతటి కార్యమైనా ప్రారంభిస్తారు. అంతటి ప్రసిద్ధి చెందిన వినాయకుడు ప్రతీ ఏటా వినాయక చవితి నుంచి 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించుకుంటాడు. ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం పూజలందుకొని భక్తులను ఆశీర్వదిస్తాడు. అయితే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోపూజ చేసుకుంటారు. అయితే ఈ 5 మంత్రాల ద్వారా పూజ చేయడం ద్వారా గణనాథుడి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఆ మంత్రాలేవంటే?
ఈ సంవత్సరం వినాయకచవితి సెప్టెంబర్ 18న నిర్వహిస్తారని అంటున్నారు. మరికొందరు 19న జరుపుకుంటామని చెబుతున్నారు. ఏ రోజు జరుపుకున్నా వినాయకుడికి ప్రత్యేక పూజ చేసేవారు మొదట శుచి శుభ్రతతో మెలగాలి.సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి వినాయకుడిని ప్రతిష్టించాలి. ఆ తరువాత ఇంటిల్లిపాది వినాయకుడి పూజ ప్రదేశం వద్ద కూర్చొని మంత్రాలు చదువుతూ ఉండాలి. వినాయకుడికి ఈ రకమైన మంత్రాలు చదవడం వల్ల ఇంట్లో చక్కటి ఎనర్జీ వాతావరణం కూడా అలవడుతుంది.
పాఠశాలల్లోనూ ప్రార్థన మొదలయ్యే ముందు పాటించే మంత్రం ‘శుక్లాం బరధరం’.. ఈ శ్లోకాన్ని పూజ ప్రారంభించే ముందు కూడా పఠించాలి.
‘శుక్లాంబరధరం, విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్నవదనం థ్యయేత్ సర్వ విఘ్నోపశాంతయే..
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ:
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా..
గజాననం భూధ గణాథి సేవిథం కభిథ జంభూ ఫలసార పక్షిథం
ఉమాసుతం శోక వినాకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం’ .. అని చదవాలి
చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు
‘ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతి ప్రచోదయాత్..’ అని పఠించాలి.
అలాగే ‘ఓం హ్రీన్గ్ గ్రీన్గ్ హ్రీన్ఘ్’ అనే మంత్రాన్ని చదవడం వల్ల వీరిలో ఎనర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్వఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా అని చెప్పడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆరోజు ఇంట్లో వాళ్లంతా సంతోషంగా గడుపుతారు.