https://oktelugu.com/

Smart Phone : ఫోన్ అతిగా వాడితే పెనుముప్పు.. ప్రయోగంలో తేలిన షాకింగ్ విషయాలివీ

ఇక మెడను అలానే ఉంచడం వల్ల డిస్క్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఫోన్ వాడకం అనేది ఒక పరిమితి వరకు బానే ఉంటుందని.. మించితే అనేక రకాల అనర్ధాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 29, 2024 / 11:03 AM IST
    Follow us on

    Smart Phone : అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన జీవితం అయిపోయింది. మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఎదుటి వ్యక్తితో జరిపే సంభాషణ నుంచి ఆన్ లైన్ లో లావాదేవీల వరకు ప్రతిదీ ఫోన్ ద్వారానే జరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వాడకం తారస్థాయికి చేరడంతో దానివల్ల జరిగే అనర్ధాలు కూడా అలానే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల ఎలుకల మీద జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

    స్మార్ట్ ఫోన్ విపరీతంగా వాడుతున్న నేపథ్యంలో మనుషులపై ఏమైనా అనర్ధాలు ఉంటాయా అనే కోణంలో ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తల బృందం ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. కొన్ని స్మార్ట్ ఫోన్ లను ఒక ట్రే లో ఉంచింది. ఆ ట్రైలో కొన్ని ఎలుకలను ఉంచారు. మరో ట్రే లో కొన్ని ఆరోగ్యకరమైన ఎలుకలను ఉంచారు. రెండు ట్రైలలో ఎలుకలకు రోజూ ఆహారం, తాగునీరు అందించారు. ఇలా కొద్ది రోజులైన తర్వాత రెండు ట్రేలలో ఉన్న ఎలుకలను శాస్త్రవేత్తలు పరిశీలించగా..ఫోన్ లు ఉన్న ట్రేలలో ఎలుకలు అనారోగ్యానికి గురైనట్టు గుర్తించారు. వాటిని పరీక్షించగా క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు అవి స్మార్ట్ ఫోన్లు వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వాటి శరీరంలో అనేక రకాలైన మార్పులు కనిపించాయి.

    ప్రస్తుతం ప్రతీ పనికి చాలామంది స్మార్ట్ ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం కూడా తారా స్థాయికి చేరింది. కొంతమంది ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ తోనే సహవాసం చేస్తున్నారు. దీనివల్ల కళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడి.. అది కంటి చూపు పై ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ను చూస్తూ చేతిని అదేపనిగా మడత పెట్టడం వల్ల ఎల్బో లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇక మెడను అలానే ఉంచడం వల్ల డిస్క్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఫోన్ వాడకం అనేది ఒక పరిమితి వరకు బానే ఉంటుందని.. మించితే అనేక రకాల అనర్ధాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.