Weddings: పెళ్లి అంటేనే సంబరం.. సన్నాయి మేళాలు.. బంధువుల పలకరింపులు.. విందు భోజనాలు తదితర కార్యక్రమాలతో సందడిగా ఉంటుంది. మిగతా ఏ కార్యక్రమాలకు హాజరు కాకున్నా పెళ్లి వేడుకకు ఎంత దూరం ఉన్నా హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు జీవితంలో కలిసి నడిచేందుకు వివాహ బంధంతో ఒక్కటయ్యే వారిని ఆశీర్వదించనున్నారు. నేటి కాలంలో పెళ్లి మూడు నుంచి ఐదు రోజులు పాటు నిర్వహించనున్నారు. మంగళ స్నానాలు, మెహందీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. అయితే పెళ్లి తరువాత ఊరేగింపు సమయంలో భరాత్ డ్యాన్స్ అనే కార్యక్రమం ఉంటుంది. ఇందులో పిల్లల నుంచి యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. అయితే ఇక్కడ యువకులు మాత్రం మెరికలు తిరిగే డ్యాన్స్ చేస్తుంటారు. ఇలాంటి వారికి ఐసీఎంఆర్ హెచ్చరిక చేసింది.
Indian Counsil Of Medica Research (ICMR) నిత్యం మానవ ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తూ ఉంటుంది. 2019 నుంచి 2022 వరకు ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా సమయంలో ఐసీఎంఆర్ పేరు బాగా వినిపించింది. తాజాగా ఈ రీసెర్చ్ సంస్థ ఒక హెచ్చరికను జారీ చేసింది. ఇటీవల పెళ్లిళ్ల ఊరేగింపులో బరాత్ డ్యాన్స్ చేస్తూ చాలా మంది పడిపోయారు. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల్లో గార్బా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయారు. మరికొందరు జిమ్ వర్కౌట్లు చేస్తూ గుండెపోటుతో మరణించారు.
వీరి మరణాలను పరిగణలోకి తీసుకున్న ఐసీఎంఆర్ పరిశోధనలు చేసింది. అయితే ఇలా మరణించిన వారిలో ఎక్కువ మంది కోవిడ్ తో బాధపడుతున్నట్లు తేలింది. అయితే ఇలాంటి వారిలో హాట్ బీట్ పెరగడం వల్ల ఎఫెక్ట్ అయిందని అంటున్నారు. కోవిడ్ 1,2 కు గురైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. కోవిడ్ గురైన వారు హార్ట్ బీట్ పెంచడం వల్ల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా కోవిడ్ బాధితులు పెళ్లిళ్ల ఊరేగింపులో భరాత్ చేసేవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని రోజుల కింద ఐసీఎంఆర్ హెచ్చరించింది. *