https://oktelugu.com/

Hyundai Exter: మార్కెట్లోకి హ్యుందాయ్ ఎక్స్ టర్.. అదుర్స్ అనిపిస్తున్న ఫీచర్స్

హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ భారత మార్కెట్లోకి తీసుకువచ్చిన సరికొత్త కారు ఇప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తోంది. మార్కెట్లోకి వచ్చిన ఈ మైక్రో ఎస్ యూవీ ఎక్స్టర్ కార్ల ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 11, 2023 / 10:50 AM IST

    Hyundai Exter

    Follow us on

    Hyundai Exter: భారతదేశంలో కార్ల కొనుగోళ్లు ఏటా భారీగా పెరుగుతున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆయా కార్ల కంపెనీలు విభిన్న మోడల్స్ లో కార్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. తాజాగా భారత మార్కెట్లోకి హ్యుందాయ్ మోటార్స్ ఇండియా సరికొత్త మైక్రో ఎస్ యూవీనీ తీసుకువచ్చింది. ఇందులో ఉన్న అనేక ఫీచర్స్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సన్ రూఫ్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

    హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ భారత మార్కెట్లోకి తీసుకువచ్చిన సరికొత్త కారు ఇప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తోంది. మార్కెట్లోకి వచ్చిన ఈ మైక్రో ఎస్ యూవీ ఎక్స్టర్ కార్ల ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటుంది. దీని బేస్ వేరియట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5,99,900 కాగా, టాప్ వేరియంట్ ధర రూ.9,31,990 గా నిర్ణయించారు. హ్యుందాయ్ విక్రయించే ఎస్ యూవీల ఇదే అత్యంత చౌకయినది కావడం విశేషం. ఇది మార్కెట్లో టాటా పంచ్, సిట్రాన్ సి3, రెనోకిగెరో, నిస్సాన్ మాగ్నెట్ తో పోటీ పడుతుందని భావిస్తున్నారు. గ్రాండ్ ఐ10 నియోస్ ను నిర్మించిన కె1 ప్లాట్ ఫామ్ పైనే దీనిని తయారు చేశారు. ఇది ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ),; ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వేరియంట్లలో లభిస్తోంది. ఈ కారుకు దాదాపు 11 వేల బుకింగ్స్ వచ్చినట్లు హ్యుందాయ్ వెల్లడించింది. వీటిల్లో 38 శాతం ఆటో వేరియంట్ కు , 20 శాతం సీఎన్జీ వేరియంట్ కు లభించినట్లు అధికారులు వెల్లడించారు.

    కారులో 1.2 లీటర్ ఎన్ఏ ఇంజిన్..

    ఈ కారు ఇంజిన్ , మైలేజీ వివరాలను పరిశీలిస్తే.. 1.2 లీటర్ ఎన్ఏ ఇంజన్ అమర్చారు. ఇది 83 బిహెచ్పి, 114 ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. దీనిలో ఫైవ్ స్పీడ్ మాన్యువల్, 5ఆటో గేర్ బాక్స్ ల ఆప్షన్లలో లభిస్తోంది. సిఎన్జి ఇంజిన్ 69 బీహెచ్పి, 95.2 ఎన్ఎం టార్కును విడుదల చేస్తుంది. ఏఎమ్టి గేర్ బాక్స్ కు ఫెడల్ సిఫ్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మైలేజీ లీటర్ కు 19.4 కిలో మీటర్లు గా కంపెనీ చెబుతోంది. ఆటోమేటిక్ వేరియంట్ 19.2 గా, సీఎన్జీ వేరియంట్ కిలోకు 27.1 కిలో మీటర్లు దూరం ప్రయానిస్తుందని వెల్లడించింది. ఈ కారు తయారీకి పారామెట్రిక్ డిజైన్ విధానం వాడారు. చిన్న ఎస్ యూవీనే అయినా.. బాక్స్ డిజైన్ ఉండేట్లు కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. డే టైమ్ రన్నింగ్ లాంప్స్, వెనుక వైపు హెచ్ ఆకారంలో ఎల్ఈడి లైట్లు, 15 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. ఈ కారు రంగులు, మూడు డ్యూయల్ టోన్ కలర్స్ లో కారును అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు 3,815 ఎంఎం ఎత్తు ఉంది. ఈ కారు వీల్ బేస్ 2,450 ఎంఎం కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 185 ఎంఎం గా ఉంది.

    డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్..

    కారు లోపల మొత్తం భాగాలు నలుపు రంగులో ఉండేట్లు కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. ఈ కారులో సింగిల్ పాన్ సన్ రూప్, డాష్ క్యామ్, ముందు, వెనుక కెమెరాలు, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, కీలెస్ ఎంట్రీ, ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ చార్జింగ్, ఇన్ బిల్ట్ నావిగేషన్, కనెక్టెడ్ కార్ టెక్, నైస్ కమాండ్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడి, రియర్ పార్కింగ్ సెన్సార్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, అన్ని సీట్లకు షీట్ బెల్ట్ రిమైండర్ అన్ని వేరియంట్లలో లభించనున్నాయి. అద్భుతమైన ఫీచర్లు ఉండడంతో ఈ కారు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.