Hyundai Exter: రోజుకు రూ.200 పొదుపు చేసి ఈ కారును సొంతం చేసుకోండి..

కారు కొనడానికి పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు లేకున్నా ఈఎంఐ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల అవకాశం కల్పిస్తున్న ఆ కారు ఏదో కాదు.. హ్యూందాయ్ ఎక్స్ టర్.

Written By: Chai Muchhata, Updated On : September 2, 2023 6:16 pm

Hyundai Exter

Follow us on

Hyundai Exter: కారు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు బాగా డబ్బున్నవారు మాత్రమే 4 వెహికిల్ కొనేవారు. కానీ ఇప్పుడు అవసరాల రీత్యా మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా సొంత కారును కలిగి ఉంటున్నారు. కార్ల కంపెనీలు సైతం మధ్యతరగతివారికి అనుగుణంగా వెహికిల్స్ ను ఉత్పత్తి చేస్తూ సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓ కారు విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిగతా కార్ల కంటే తక్కువ ధరతో పాటు లేటేస్ట్ ఫీచర్స్ తో అలరిస్తోంది. మరి దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. అయితే వెంటనే కిందికి వెళ్లండి..

కారు కొనడానికి పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు లేకున్నా ఈఎంఐ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల అవకాశం కల్పిస్తున్న ఆ కారు ఏదో కాదు.. హ్యూందాయ్ ఎక్స్ టర్. మార్కెట్లో ఇప్పటికే ఇలాంటి కార్లు గ్రాండ్ ఐ 10, టాటా పంచ్ , సిట్రోయెన్ సీ-3 వంటి మోడళ్లు అలరిస్తున్నాయి. వీటికి గట్టిపోటీ ఇస్తోంది. హ్యుందాయ్ ఎక్స్ టర్. ఫోర్టబుల్ ఎస్ యూవీ కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకుంటున్నారు.

హ్యుందాయ్ ఎక్స్ టర్ ఫీచర్స్ విషయానికొస్తే 1.2 లీటర్ ఇంజిన్, పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ స్కిడ్ ప్లేట్, ఎలక్ట్రిక్ సన్ రూప్, డ్యాష్ క్యామ్ విత్ డ్యూయెల్ కెమెరా, 8 ఇంచుల ఇన్పఓటైన్మెంట్ స్క్రీన్,డిజిటల్ క్లస్టర్, క్యూయిజ్ కంట్రోల్ కలిగి ఉన్నాయి. లేటేస్ట్ ఎస్ యూవీ మోడళ్లలో ఉండే ఫీచర్లు ఇందులో ఉండడంతో బాగా ఆకర్షిస్తోంది. ఈ కారును మొదట రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

హ్యుందాయ్ ఎక్స్ టర్ ను ఈఎంఐ ద్వారా చెల్లలించాలనుకుంటే బ్యాంకు నుంచి రూ.4 లక్షల లోన్ తీసుకున్న అప్పుడు డౌన్ పేమేంట్ రూ.3.23 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ 8.8 శాతం పడుతుంది. 7 సంవత్సరాల టెన్యూనర్ పెట్టుకుంటే నెలకు ఈఎంఐ రూ.6,300 చెల్లించవచ్చు. అంటే రోజుకు రూ.200 పొదుపు చేస్తే ఈ కారును సంవత్సరాల్లో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ కాలంలో దీనిపై షికార్లు కొట్టవచ్చు. ఇదే ధరతో ఎక్కువ ఈఎంఐ, తక్కువ టెన్యూర్ పెట్టుకొని తొందరగా కూడా చెల్లించే అవకాశం ఉంది.