https://oktelugu.com/

Hyundai Creta: ఎస్ యు వీల అమ్మకాల్లో ఇప్పుడు ఈ కారే తోపు.. ఎగబడుతున్నారు..

హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ ఏడాది మొదటి సగం సంవత్సరంలో 83,693 యూనిట్ల క్రెటాను విక్రయించింది. ఆ తరువాత మారుతి సుజుకీ ఇండియా బ్రెజ్జా 81,928, టాటా మోటార్స్ నెక్సాన్ 78,975 యూనిట్లు విక్రయించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 11, 2023 1:21 pm
    Hyundai Creta

    Hyundai Creta

    Follow us on

    Hyundai Creta: కారు కొనాలనుకునేవారు SUVలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. బలమైన ఇంజిన్ తో పాటు విశాలంగా ఉండే కారు కోసం వెతుకుతున్నారు. ఈ సమయంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా SUVలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా హ్యుందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయినా క్రెటా ఎస్ యూవీల్లో జోరు పెంచుతున్నట్లు కనిపిస్తోంది. గత సెప్టెంబర్ దీని అమ్మకాలు 52 శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. హ్యుందాయ్ కంపెనీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఇయర్ లో ఎస్ యూవీ అమ్మకాల చార్ట్ ను పరిశీలిస్తే హ్యుందాయ్ క్రెటా అగ్రగామిగా నిలిచింది. ఈ కారు వివరాల్లోకి వెళితే..

    హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ ఏడాది మొదటి సగం సంవత్సరంలో 83,693 యూనిట్ల క్రెటాను విక్రయించింది. ఆ తరువాత మారుతి సుజుకీ ఇండియా బ్రెజ్జా 81,928, టాటా మోటార్స్ నెక్సాన్ 78,975 యూనిట్లు విక్రయించింది. హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 115 పవర్ తో 144 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5 లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ పెట్రోల్ యూనిట్ ను 6 స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీని కలిగి ఉంది. దీని ధర రూ.10.87 లక్షల నుంచి రూ.19.20 వరకు విక్రయిస్తున్నారు.

    మారుతి సుజుకీ బ్రెజా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 103 పవర్, 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ ఏటీ తో సీఎన్ జీ వెర్షన్ 88 పవర్, 121 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.8.29 లక్షల ఎక్స్ షో రూం ధరతో విక్రయిస్తున్నారు. ఇక టాటా నెక్సాన్ వివరాల్లోకి వెళితే 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ 115 పీఎస్, 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ ఏఎంటీ, 7 స్పీడ్ డీసీఎలను కలిగి ఉంది. దీనిని రూ.8.29 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    మారుతి సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్ ల ధరలతో పోటీ పడుతున్నాయి. ఫీచర్స్ లోనూ సరిసమానంగా ఉన్నాయి. అయితే హ్యుందాయ్ క్రెటాలో బలమైన ఇంజిన్ తో పాటు విశాలమైన వెహికిల్ ఇది. ఎస్ యూవీ గురించి ఆలోచించేవారు ఎక్కువగా హ్యుందాయ్ క్రెటా వైపై వెళ్తున్నారు. అందుకే ఈ ఏడాది అర్ధభాగంలో ఈ మోడల్ అత్యధికంగా విక్రయాలు జరుపుకుంది.