Tips To Impress Partners: శృంగారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జీవితం నందనవనమే. అనవసర భయాలు, అపోహలు పెట్టుకోవద్దు. సెక్స్ ను పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే మనసులో ఆందోళనలు ఉండకూడదు. సాధ్యమైనంత వరకు నిదానంగానే స్పందించాలి. ఏదో కావాలనే ఆతృత మంచిది కాదు. పరస్పర అభిప్రాయాలు గౌరవించుకుంటూ ఒకరి నిర్ణయాలు మరొకరు పాటిస్తే శృంగారం విషయంలో నష్టాలు ఉండవు. అంతేకాని ఏదో సాధించాలనే తపనతో హడావిడి చేస్తేనే నష్టాలు ఉంటాయని తెలుసుకోవాలి. జీవిత భాగస్వామని సంతోష పెట్టే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులకు ఆస్కారం ఇవ్వొద్దు. నిదానంగా సెక్స్ ను ఎంజాయ్ చేసేందుకు కట్టుబడి ఉండాలి.

శృంగారం విషయంలో ఆడవారు మగవారి అంత తొందరగా స్పందించరు. అందుకే వారి మూడ్ ను బట్టి మనం నడుచుకోవాలి. అంతేకాని ఏదో జరిగిపోవాలి అనే ఆతృతలో తొందరగా ముగిస్తే లాభం ఉండదు. జీవిత భాగస్వామిని సుఖపెట్టే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని వారి మనసు తెలుసుకుని ప్రవర్తించాలి. తొందరపాటు చర్యలు పనికిరావని గుర్తించాలి. జీవితభాగస్వామి కోర్కెలను గమనించి నడుచుకుని వారికి సుఖం అందించే క్రమంలో ముందుకు వెళ్లాలి. దీంతో జీవితం ధన్యమవుతుందని తెలుసుకుంటే మంచిది.
Also Read: Deepak Hooda: లక్కీ దీపక్ హుడా.. అతడుంటే టీమిండియా గెలిచినట్టే.. వరుసగా 16వ విజయం
శృంగారం విషయంలో ఎప్పుడు రొటీన్ కాకుండా విభిన్నంగా ప్రయత్నించాలి. సెక్స్ ఒకే పద్ధతిలో కాకుండా భిన్నంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. జీవితంలో వెరైటీ అనేది ఉండాల్సిందే. అది శృంగారం విషయంలో కూడా చూసుకోవాలి. రెగ్యులర్ గా కాకుండా వెరైటీ కోసం తాపత్రయపడితే ఫలితాలు వేరేలా ఉంటాయి. రొటీన్ కు భిన్నంగా ఉంటే జీవితభాగస్వామి కూడా సంతోషపడుతుంది. అందుకు మనం ప్రాంతాలైనా, పద్ధతులైనా మార్చుకుంటూ ముందుకు పోవాలి.

జీవిత భాగస్వామి అభిప్రాయాలు గౌరవించాలి. రొమాన్స్ విషయంలో మగవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆడవారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. శృంగారాన్ని బంగారంలా చూసుకునే వారుండటం తెలిసిందే. సెక్స్ ను ఎంజాయ్ చేసే క్రమంలో ఎన్నో పద్ధతులు పాటించాలి. జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలంటే అందులో సెక్స్ కూడా ఒక భాగమే. దీంతో సెక్స్ ను ఇద్దరు ఆస్వాదించాలంటే కొత్త పద్ధతుల్లో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవాలి.
Also Read:How to Win Her Heart With Words: మగువల మనసు గెలుచుకోవాలంటే ఏ మాటలు వాడాలో తెలుసా?