https://oktelugu.com/

Relationship: ఇలాంటి అమ్మాయిలు అసలు వైఫ్ మెటీరియల్సే కారు.. పెళ్లి చేసుకుంటే రోజూ నరకమే!

కొందరు అమ్మాయిలు తన భర్త తనతోనే ఉండాలని కోరుకుంటారు. ఇలా కోరుకోవడం మంచిదే. కానీ కుటుంబ సభ్యులు ఎవరితో కూడా సమయం గడకుండా కేవలం నీతోనే ఉండాలి అనుకోవడం తప్పు. ఇలా ఎక్కువగా అటెన్షన్ కోరుకునే అమ్మాయిల్ని అబ్బాయిలు అంతగా ఇష్టపడరు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2024 / 07:41 AM IST

    Relationship

    Follow us on

    Relationship: పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన వారిని అర్థం చేసుకునే భాగస్వామి రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే అన్ని విధాలుగా అర్థం చేసుకున్న అమ్మాయి తన లైఫ్ లో రావాలని కోరుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే.. ఈ అమ్మాయి వైఫ్ మెటీరియల్ అనిపించే అమ్మాయి తన లైఫ్ లో ఉండాలని అనుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి వాళ్ళ లైఫ్ లోకి వస్తే జీవితాంతం నరకంగానే భావిస్తారు. అయితే చూడగానే ఎవరి వ్యక్తిత్వం అనేది వెంటనే తెలిసిపోదు. కొన్ని రోజులు వాళ్ళ ట్రావెల్ చేస్తేనే వాళ్ళ విధివిధానాలు ఏంటి అనేది పూర్తిగా తెలుస్తాయి. అయితే కొందరు అమ్మాయిల్లోనే కొన్ని లక్షణాలు వల్ల వారు అసలు భాగస్వామిగా పనికిరారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల అబ్బాయిలు జీవితాంతం నరకం అనుభవిస్తారు. అయితే ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే వారి జీవితం బతుకు బస్టాండ్ అవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    అటెన్షన్ సీకర్
    కొందరు అమ్మాయిలు తన భర్త తనతోనే ఉండాలని కోరుకుంటారు. ఇలా కోరుకోవడం మంచిదే. కానీ కుటుంబ సభ్యులు ఎవరితో కూడా సమయం గడకుండా కేవలం నీతోనే ఉండాలి అనుకోవడం తప్పు. ఇలా ఎక్కువగా అటెన్షన్ కోరుకునే అమ్మాయిల్ని అబ్బాయిలు అంతగా ఇష్టపడరు.

    అహంకారం ఉన్న అమ్మాయిలు
    కొంతమంది అమ్మాయిలకి ఈగో ఉంటుంది. అసలు ఏ విషయంలో కూడా తగ్గరు. ఇలాంటి అమ్మాయిని అసలు లైఫ్ లో ఉంచుకోవద్దు. ఎందుకంటే భార్యాభర్తల బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే ఇద్దరి మధ్య ఎలాంటి అహంకారం ఉండకూడదు. అహంకారం కి పోతే ఇద్దరి మధ్య బంధం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండడమే మేలు.

    గౌరవం ఇవ్వనివారు
    కొందరు అమ్మాయిలు భర్తకి అస్సలు గౌరవం ఇవ్వరు. భర్తపై ప్రేమ ఉంటే సరిపోదు గౌరవం కూడా ఉండాలి. అలాగే భర్త కుటుంబ సభ్యులకు కూడా కనీసం గౌరవం ఇవ్వరు. ఏ బంధంలో అయినా గౌరవం అనేది తప్పనిసరి. కనీస మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా గౌరవం ఇవ్వని అమ్మాయిని అసలు మీ లైఫ్ లోకి తెచ్చుకోవద్దు.

    అసూయ చూపించేవారు
    కొందరు అమ్మాయిలు పైకి ప్రేమ చూపిస్తారు కానీ మనసులో మాత్రం చాలా అసూయతో ఉంటారు. బాగా భర్త కనీసం అబ్బాయిల ఫ్రెండ్స్ తో మాట్లాడిన కూడా ఇష్ట పెట్టుకోరు. ఎవరితో కూడా ఉండకుండా తనతో ఉండాలని కోరుకుంటారు. అలాగే సొంత తల్లిదండ్రులు, సోదరులు, బంధువుల పైన కూడా అసూయతో ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అమ్మాయితో జీవితాన్ని పంచుకోవద్దు.

    అబద్ధం చెప్పేవారు
    ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్పే వాళ్ళని అసలు నమ్మకూడదు. ఎందుకంటే భర్త దగ్గర మంచిగా ఉండాలని అన్ని విషయాలు దాస్తుంటారు. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ఉండే బంధం ఏదో ఒక రోజు విరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా అబద్ధాలు చెప్పే అమ్మాయిని అసలు లైఫ్ లోకి రానీయవద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.