Human Life : పుట్టిన ప్రతీ మనిషి గిట్టక మానడు.. అయితే వ్యక్తుల మధ్య తేడాలుంటాయి. అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క జీవిత కాలం పూర్తయిన తరువాత మరణిస్తారు. ఇప్పుడున్న రోజుల్లో యావరేజ్ గా ప్రతీ వ్యక్తి 65 ఏళ్ల కంటేఎక్కువ రోజులు జీవించడం కష్టమేనని కొన్ని నివేదికలు చెప్పాయి. కానీ అంతకంటే ఎక్కువ రోజులు కూడా జీవించేవారున్నారు. అందుకు ఆరోగ్యకారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, కొన్ని ఆరోగ్యకమైన అలవాట్లు ఉంటే మనుషులు ఎక్కువగా జీవిస్తారని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. అమెరికా, చైనా కు చెందిన కొందరు పరిశోధలకు చేసినవ వివరాల్లోకి వెళితే..
కొన్ని ఆహారపు అలవాట్లను పాటిస్తే మనిషి ఎక్కువకాలం జీవిస్తాడని పరిశోధకులు తేల్చారు. ఇందుకోసం ముందుగా ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి వాటికి వివిధ రకాల ఆహారాన్ని అందించారు. ఒక గ్రూపు ఎలుకలకుఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. మరో గ్రూపు ఎలుకలకు తక్కువ కేలరీలున్న పదార్థాలను అందించారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు వీటిపై ఆ ఆహారం ఎలా పనిచేస్తుందో గమనించారు.
ఎక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకలు తొందరగానే మరణం వైపు వెళ్లాయి. తక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాయి. అంటే తక్కువ కేలరీలు తీసుకున్నఎలుకల్లో కణాల క్షీణత చాలా నెమ్మదిగా సాగింది. అంటే శరీరానికి అవసరాని కంటేఎక్కువ కేలరీలు తీసుకుంటే ఎప్పటికైనా ప్రమాదమేనని పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధన వివరాలను సెల్ అనే ఓ జర్నల్ లో ప్రచురించారు.
ఇది మనుషులకు కూడా వర్తిస్తుందని పరిశోధకులు చెప్పారు. ఆహారాన్ని మితంగా తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా కణాల క్షీణతను అడ్డుకోవచ్చని, ఫలితంగా ఎక్కువ కాలం పాటు జీవించవచ్చని అంటున్నారు. నేటి కాలంలో చిరుతిళ్లు ఎక్కువయ్యాయి. అలాగే రుచికరమైన ఆహారం పేరిట మోతాదుకు మించి లాగేస్తున్నారు. దీంతో శరీరంలో అనేక మార్పులు వచ్చి కణాలు తొందరగానే నశించిపోతున్నాయి. దీంతో తొందరగానే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.