Maruti Offers: కార్ల కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరూ కారు కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. తమ కుటుంబం కారులో తిరగాలని కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే కారు కొనుక్కుని తమ జీవిత కాల వాంచ తీర్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా పలు శుభవార్తలు అందిస్తున్నాయి. ధరలు భారీగా తగ్గిస్తూ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్లు కొనుగోలు చేసుకుని తాము అనుకున్నది సాధించుకోవాలని చూస్తున్నారు.

కారు కొనాలనుకునే వారికి శుభవార్త అందిస్తున్నాయి. భారీ ఆఫర్లు అందిస్తన్నాయి. ఏకంగా రూ. వేలల్లో ధరలు తగ్గిస్తున్నారు. కార్ల తయారీ సంస్థలు అదిరే ఆఫర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రూ. 57 వేల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. నవంబర్ నెలలో మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. దీంతో కార్లు కొనుక్కోవాలకునేవారు త్వరపడాలని సూచిస్తున్నారు. మారుతి సుజుకీ కంపెనీ వినియోగదారులకు చేరువయ్యేందుకు ముందుకు వస్తోంది.
ఎక్చేంజ్ ఆఫర్, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ వంటివి కార్లు కొనాలకునే వారికి తగ్గింపు ధరలు ఆకర్షణ కలిగిస్తున్నాయి. కారు మోడళ్లు కనువిందు చేస్తున్నాయి. దగ్గరలోని ఆఫీసుకు వెళ్లి ఆఫర్ విషయాలు తెలుసుకుని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఆల్టో కే 10 కార్లు కొనుగోలు చేస్తే రూ.57 వేలు ఆదా చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు ఉంది. కార్పొరేట్ బెనిఫిట్స్ రూ. 7 వేల దాకా తగ్గుతోంది. ఇలా బంపర్ ఆఫర్లు ఉండటంతో కార్లు కొనుగోలు చేసేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు.

సెలెరియా కారుపై కూడా రూ. 56 వేల వరకు తగ్గింపు ఇస్తున్నాయి. కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.6 వేలు, ఎక్చేంజ్ బోనస్ రూ. 15 వేల దాకా అందజేస్తోంది. దీంతో క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు లభిస్తోంది. ఇంకా అనేక రకాల కంపెనీలు వినియోగదారులకు ఎన్నో ఆఫర్లు అందిస్తున్నాయి. దీంతో చాలా మంది కార్ల కొనుగోలుతో తమ డిగ్నిటి పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్లు కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. తగ్గిన ఆఫర్లతో తమ కోరికలు తీర్చుకుంటున్నారు.