UTS Mobile App: మన దేశంలో రైలు మార్గం చాలా పొడవైనది. నిత్యం ట్రైన్ లో వేల కొద్దీ మంది ప్రయాణిస్తూ ఉంటారు. రైలులో వివిధ కేటగిరీలుగా మార్చి ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలను ఉంచుతారు. ఇందులో జనరల్ తో పాటు స్లీపర్, టుటైర్, త్రీటైర్ విభాగాలు ఉంటాయి. స్లీపర్ నుంచి అప్పర్ క్లాస్ లో ప్రయాణించేవారు టికెట్ కోసం ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ బోగీల్లో వెళ్లే వారు ట్రైన్ స్టేషన్ లో క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి. ప్రధాన స్టేషన్లలో జనరల్ టికెట్ కోసం క్యూ భారీగా ఉంటుంది. ఈ క్రమంలో క్యూలో నిలబడకుండా ఓ యాప్ లోనే జనరల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
నేటి కాలంలో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఉంటుంది. కొన్ని పనులను ఈజీగా చేసుకునేందుకు యాప్ లు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మనీ ట్రాన్స్ ఫర్ నుంచి కరెంట్ బిల్లు కట్టుకునే వరకు వివిధ రకాల అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ట్రైన్ జర్నీ చేయాలనుకునే వారు స్లీపర్ క్లాస్ నుంచి అప్పర్ కేటగిరీలో ప్రయాణించేవారు రిజర్వేషన్ కోసం IRCTC లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో జనరల్ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. జనరల్ టికెట్ కోసం సంబంధిత స్టేషన్ లోనే క్యూలో నిలబడాలి.
కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే UTS యాప్. ముందుగా ప్లే స్టోర్ కు వెళ్లి UTS అని టైప్ చేయగానే ఆరేంజ్ కలర్లో ఉన్న ఓ యాప్ కనిపిస్తుంది. దీనిని ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యాప్ లోనే పేమేంట్ చేస్తే సరిపోతుంది. దీంతో క్యూలో నిలబడకుండా టికెట్ చేతిలో ఉంటుంది. జనరల్ టికెట్ మాత్రమే కాకుండా ఫ్లాట్ ఫాం టికెట్ ను కూడా ఇందులో బుక్ చేసుకోవచ్చు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిద రకాల యాప్ లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు జనరల్ టికెట్ కోసం యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంట్లోనే ఈ టికెట్ బుక్ చేసుకొని సరైన సమయానికి స్టేషన్ కు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.