https://oktelugu.com/

Parcel a Bike in a Train: రైలులో బైక్ ను ఎలా పార్శిల్ చేస్తారు? ఎంత చార్జీలు వసూలు చేస్తారు?

దేశంలో రైలు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. రవాణా మార్గం తరువాత రైలు ప్రయాణాలే ఎక్కువగా చేస్తుంటారు. చాలా చీఫ్ ధరతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా రైలులో ప్రయాణం చేసే సమయంలో ఎక్కువ వస్తువులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తీసుకెళ్లే సమయంలో వాటికి ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది

Written By:
  • Srinivas
  • , Updated On : October 28, 2024 1:01 pm
    Parcel-a-Bike-in-a-Train

    Parcel-a-Bike-in-a-Train

    Follow us on

    Parcel a Bike in a Train:ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం పలు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో మనతో పాటు మనకు ఇష్టమైన వస్తువులను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఇంటి సామాను కావొచ్చు..లేదా ఇష్టమైన వస్తువులు కావొచ్చు. అయితే మిడిల్ క్లాస్ ఇంట్లో కామన్ గా ప్రయాణం చేయడానికి టూ వీలర్ కచ్చితంగా ఉంటుంది. టూ వీలర్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కార్యాలయానికి వెళ్లడంతో పాటు ఇంటి అవసరాలకు టూవీలర్ ప్రస్తుత కాలంలో తప్పనిసరి. అయితే ఉద్యోగం మారినప్పుడు మనతో పాటు బైక్ ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బైక్ ను రైలులో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో బైక్ ను పార్సిల్ చేస్తే ఎంత చార్జి అవుతుంది? దీనిని ఎలా తీసుకొస్తారు? ఆ వివరాలు తెలుసుకోవాలంటే కిందికి వెళ్లండి..

    దేశంలో రైలు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. రవాణా మార్గం తరువాత రైలు ప్రయాణాలే ఎక్కువగా చేస్తుంటారు. చాలా చీఫ్ ధరతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా రైలులో ప్రయాణం చేసే సమయంలో ఎక్కువ వస్తువులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తీసుకెళ్లే సమయంలో వాటికి ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం వెళ్లాలంటే బైక్ పై వెళ్లాలంటే కుదరదు. ఈ క్రమంలో బైక్ ను రైలులో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు రైలులో బైక్ తీసుకెళ్లే ఎంత చార్జీ వేస్తారంటే?

    బైక్ ఏదైనా రైలులో తీసుకెళ్తే ఒకే రకమైన చార్జీలు ఉంటాయి. ముందుగా బైక్ బరువును లెక్కిస్తారు. దీని బరువుతో పాటు ప్రయాణ దూరాన్ని బట్టి చార్జీలు వేస్తారు. ఒక బైక్ ను 500 కిలోమీటర్ల వరకు రైలులో తీసుకెళ్లాలంటే రూ. 2,000 ఛార్జి చేస్తారు. అంతకుమించి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే అంతకు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారు. అయితే దీనిని సాధారణంగా కాకుండా ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తారు. అంతేకాకుడా బైక్ లో ఎలాంటి పెట్రోల్ ఉండకుండా మొత్తం తీసివేస్తారు. అంతేకాకుండా బైక్ కు సంబంధించిన పత్రాలను రైల్వేస్టేషన్ కు సమర్పించాల్సి ఉంటుంది.

    బైక్ మాత్రమే కాకుండా కారును కూడా తీసుకెళ్లొచ్చు. అయితే దీని కోసం ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి. కానీ చాలా మంది కార్లను రైలులో పంపకుండా నేరుగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తారు. అయితే కొత్త వాహనాలను పంపడానికి మాత్రం రైలును ఉపయోగించుకుంటారు. ఇవి ఒకటి కాకుండా పదుల సంఖ్యలో ఒకేసారి పార్శిల్ చేస్తుంటారు. సింగిల్ పర్సన్ కారును తక్కువగా పార్శిల్ చేస్తుంటారు. అయితే ఎక్కువగా బైక్ ను మాత్రమే రైలులో పార్శిల్ చేస్తుంటారు.

    బైక్ ద్వారా ఎన్నో అవసరాలు తీరుతూ ఉంటాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఇది ముఖ్యమైన సాధనం.అయితే ప్రదేశాలు మారిన సమయంలో కొత్త బైక్ ను కొనాలంటే సాధ్యం కాదు. అందువల్ల దీనిని చాలా మంది వారి వెంట తీసుకెళ్లూ ఉంటారు.