Money Earn: 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే డబ్బు అనే వస్తువు మీద జీవితాంతం పని చేస్తాడు. అందుకే, డబ్బు చేతులనే కాదు మనుషులను కూడా మారుస్తోంది. ప్రపంచంలో డబ్బు సంపాదన కోసం ఎన్నో మార్గాలున్నాయి. మనిషికి డబ్బు రావాలన్నా మనిషి నుంచే రావాలి. మనిషి డబ్బు ఇవ్వాలన్నా మనిషికే ఇవ్వాలి.

ఎవరైనా ఎదుటి వ్యక్తికి డబ్బు ఇవ్వాలంటే ఒకటే మార్గం. ఆ వ్యక్తికి అవతలి వారి దగ్గర ఉన్న వస్తువు కానీ, సేవ కానీ అవసరం పడాలి. ఆ అవసరం పడిన దానికి సరిసమానమైన విలువను బట్టి డబ్బు ని చెల్లిస్తారు.
Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!
అయితే, ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి: అవతలి వారి జీవితంలో కొద్దిగా విలువని జోడిస్తూ, తక్కువ చార్జ్ చేయడం, రెండు: అవతలి వారి జీవితంలో చాలా ఎక్కువ విలువని జోడిస్తూ .. తక్కువ మందికే సేవ చేస్తూ, దానికి ప్రీమియం గా చార్జ్ చేయడం.

ఏది ఏమైనా మనకున్న సమర్థతను బట్టి, నైపుణ్యాన్ని బట్టి, మనకున్న వనరులను బట్టి కాంబినేషన్ మారుతూ ఉంటుంది. వాటిని మనమే ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా మనలో లేని వాటితో వాళ్ళెవరో విజయం సాధించారని మనం కూడా అదే ఫాలో అయితే బొక్క బోర్లా పడటం ఖాయం.
చివరగా ఒక్కటి డబ్బు ఊరికే రాదు. అందుకే డబ్బు అనేది ప్రస్తుత సమాజంలో ప్రధాన కొలమానం అయిపోయింది. మనిషికి విలువనే కాదు. జీవితాన్ని కూడా ఇచ్చేది డబ్బు మాత్రమే అన్నట్టు అయిపోయింది సమాజ పరిస్థితి.
Also Read: కాపు నాయకులపై ఎన్నో అనుమానాలు?