Natural Immunity Boost: ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గగనంగా మారింది. వాతావరణ కాలుష్యంతో పాటు.. కల్తీ ఆహారాలు ఉండడంవల్ల అనుకోకుండా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. అయితే అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి పెరగడానికి రోజు తినే ఆహారం కాకుండా ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఇవి మార్కెట్లో, ఇంట్లో అందుబాటులో ఉన్నా.. వాటిని పట్టించుకోం. కానీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా మతిమరుపు, మోకాళ్ల నొప్పులు వంటి వాటిని కూడా ప్రతిరోజు తీసుకునే కొన్ని ప్రత్యేక పదార్థాల ద్వారా దూరం చేయవచ్చు. మరి ఆ పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా?
ప్రతిరోజు ఉదయం తేనె నీరు తాగడం చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బి ఉంటాయి. అలాగే కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు మినరల్స్, ఎంజైమ్ లు సమృద్ధిగా లభిస్తాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే మతిమరుపు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు తేనె తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు. రోజంతా యాక్టివ్ గా పని చేయగలుగుతారు. తేనె తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది.
ప్రతిరోజు కూరలో ఉండే కరివేపాకును తీసివేస్తూ ఉంటాం. వాస్తవానికి కొందరు దీనిని తీసివేయడం ఎందుకని వాడకుండా ఉంటారు. కానీ కరివేపాకును తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఈ ఉంటాయి. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. అలాగే డయాబెటిక్ సమస్య ఉన్నవారు అదుపులోకి వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి కరివేపాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కూడా కరివేపాకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
ఇంట్లో ఎక్కువగా కనిపించే జీలకర్రను ఎవరూ పట్టించుకోరు. కానీ ప్రతిరోజు కూరలో జీలకర్ర తప్పనిసరిగా వేసుకోవాలి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణం క్రియను పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి జీలకర్ర ఔషధంలా పనిచేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు దీనిని నేరుగా తీసుకోవచ్చు. అలాగే కండరాల నొప్పి, నరాల బలహీనత ఉన్నవారు సైతం జీలకర్రను వాడుకోవాలి. ప్రతిరోజు కూరలో జీలకర్ర ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.
Also Read: జీవితాన్ని సంకనాకిస్తున్న ఐదు వ్యసనాలు ఇవే!
మార్కెట్లో విరివిగా దొరికే బొప్పాయితో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, సి ఉంటాయి. అలాగే పొటాషియం అధికంగా ఉంటుంది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉండడంతో జీర్ణక్రియకు ఇది ఎంతో సహకరిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది. కంటి సమస్య ఉన్నవారు దీనిని ప్రత్యేకంగా తీసుకోవాలి. అలాగే చర్మం నిగారింపు ఉండడానికి ప్రతిరోజు దీని పేస్టును అప్లై చేయాలి. అలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఫేసులో గ్లో వస్తుంది.