Original Honey: తీయని పదార్థాల గురించి చెప్పేటప్పుడు తేనె వస్తుంది. తేనె తినడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం. వేడి పాలలో తేనే వేసుకొని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నాడి కణాల సమస్యలు దూరమవుతాయి. హాయిగా నిద్రపోవడానికి పాలలో తేనె కలుపుకొని తాగాలి. క్రమం తప్పకుండా తేనెను తీసుకోవడం ద్వారా మలబద్ధకంను దూరం చేయొచ్చు. తేనె వల్ల ఎముకలు ధృఢంగా మారుతాయి. చిన్న పిల్లలకు తేనెను తినిపించడం వల్ల వారిలో ఎదుగుదల బాగుటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు అవసరం . ఈ నీటితో కొంచెం తేనెను తగిలించడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేటి కాలంలో స్వచ్ఛమైన వస్తువు ఏదీ దొరకడం లేదు. ఇందుకు తేనె కూడా మినహాయింపు కాదు. కల్తీ తేనె తాగడం వల్ల ఆరోగ్యం మాట అటుంచి కొత్త రోగాలు దరి చేరుతాయి. అయితే కల్తీ తేనెను గుర్తించడం ఎలా? ఏదీ కల్తీనూనె? అనే వివరాల్లోకి వెళితే..
స్వచ్ఛమైన తేనెను గుర్తించాలంటే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోవాలి. అందులు ఒక చెంచాడు తేనెను వేయాలి. ఇలా తేనెను వేయగానే అది ముద్దలాగా నీటి అడుగున చేరితే అది స్వచ్ఛమైన తేనె అని గుర్తించవచ్చు. లేదా నీళ్లలో కలిసిపోతే అది కల్తీ అయిందని గుర్తించాలి. అలాగే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక చుక్క తేనె వేయాలి. స్వచ్ఛమైన తేనెను టిష్యూ పేపర్ పీల్చుకోదు. పైగా మరక కూడా కాదు. అదే కల్తీ తేనె అయితే వెంటనే పీల్చుకుంటుంది.
ఒక గిన్నెలో కొంచెం తేనెను తీసుకొని వేడి చేయాలి. ఆ తరువాత అది బంగారం రంగులోకి మారి మంచి సువాసన ఇస్తుంది. కల్తీ తేనె అయితే వెంటనే మండడం లేదా కాలిన వాసన వస్తుంది. ఇక స్వచ్ఛమైన తేనె బంగారు రంగులో ఉంటుంది. కల్తీ తేనే లేత బంగారు రంగులో ఉంటుంది. స్వచ్ఛమైన తేనె అసిడిక్ స్వభావంతో ఉంటుంది. దీనిని వెనిగర్ తో కలిపినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉండదు. కానీ కల్తీ తేనె వెనిగర్ కు వ్యతిరేకంగా చర్యకు గురవుతుంది. ఇలా స్వచ్ఛమైన, కల్తీ తేనెను గుర్తించి ఆరోగ్యంగా ఉండండి..