Ring Worm: ఇటీవల వస్తున్నరోగాల్లో తామర ఒకటి. శరీరం దురదగా ఉంటుంది. ఎప్పుడు అక్కడే గోక్కోవాలనిపిస్తుంది. చర్మం పొడిబారి పోతుంది. చర్మం దురదగా ఉండటం, పాలిపోవడం, పెలుసులుగా ఉండటం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పొడిబారి పొరలుగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉంటే అల్కహాల్ కు దూరంగా ఉండటమే మంచిది. బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు.
ఇంట్లో దొరికే పదార్థాలతోనే సులభమైన చిట్కాతో తామరకు మందు తయారు చేసుకోవచ్చు. దీంతో తామరను శాశ్వతంగా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పూజలకు వాడే కర్పూరం బిళ్లలను తీసుకుని రోట్లో వేసి దంచుకోవాలి. తులసి ఆకులు నాలుగైదు వేసి అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం పిండి మెత్తగా నూరుకోవాలి.
ఈ మిశ్రమాన్ని దద్దుర్లు ఉన్న చోట రాసి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్ల మచ్చలు, గజ్జి, తామర వంటి లక్షణాలు పోతాయి. ఇలా సులభమైన చిట్కాతో తామరను దూరం చేసుకోవచ్చు. తామర ఉంటే ఎప్పుడు దురద పెడుతుంది. నలుగురిలో ఉన్నా గోక్కోవాలనే ఆలోచన రావడం సహజమే. దీంతో దీన్ని దూరం చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది.
ఇందులో వేసే పదార్థాలు మన ఇంట్లోనే లభించేవి. వాటికి ఖర్చు కూడా ఎక్కువ కాదు. సింపుల్ గా దొరుకుతాయి. అందుకే వాటిని వాడుకుని మన తామర సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. వ్యాధి ముదిరితే నయంచేయడం కష్టం. మొదట్లోనే గుర్తించి ఈ చిట్కా పాటిస్తే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.