
Girls: అమ్మాయిలతో స్నేహం చేయడం ఓ సరదా. ప్రెస్టేజీగా ఫీలవుతుంటారు మగవాళ్లు. ఆడవారితో సరదాగా మాట్లాడేందుకు తెగ తొందరపడుతుంటారు. కానీ అమ్మాయిలు అందరిని తమ స్నేహితులుగా అంగీకరించరు. వారు ఎన్నో పరీక్షలు పెడితే కానీ మగవారిని తమ తోటి వారుగా ఒప్పుకోరు. దీనికోసం వారిని అన్ని సమయాల్లో గమనిస్తూ ఉంటారు. వారిలో మంచి లక్షణాలు ఉంటేనే వారితో స్నేహంగా ఉంటారు. లేదంటే నో చెబుతారు. దీంతో అబ్బాయిలు కుమిలికుమిలి ఏడుస్తుంటారు. తమను ఏ ఒక్క అమ్మాయి అయినా ప్రేమించదా అని బోరున విలపిస్తుంటారు.
అసలు అమ్మాయిలతో స్నేహం చేయడం చాలా సులువు. వారిని ఎప్పుడు నవ్విస్తుండాలి. సంతోష పెడుతుండాలి. సరదాగా కబుర్లు చెబుతుండాలి. కానీ అవి బోరు కొట్టకూడదు. ఒకవేళ బోరుగా ఫీలయితే వారు ఇకపై మీ ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం అమ్మాయిలను ముగ్గులోకి దింపడం పెద్ద కష్టమైన పని కానేకాదు. చాలా సులువని పలు సర్వేలు సూచిస్తున్నాయి.
ఓ అమ్మాయి మీతో స్నేహాన్ని కోరుకుందంటే ఆమె కళ్లు చెబుతాయి. మీలోని మంచి గుణాల్ని ఆమె ఎప్పుడో పసిగడుతుంది. నీ నైపుణ్యాన్ని అంచనా వేస్తుంది. నీలోని మంచి తనాన్ని గుర్తిస్తుంది. అందుకే నీతో చనువుగా ఉంటుంది. నీవు చెప్పిన పని చేస్తుంది. మొత్తానికి ఆడవారి స్నేహంలో మగవారు తడిసి ముద్దవుతుంటారు. దీని కోసం అబ్బాయిలు తమ జీవితాలను త్యాగం చేసుకోవాల్సిన పని లేదు.
సాధారణంగా అమ్మాయిలు అందంగా ఉండాలని కోరుకుంటారు. అందమైన రూపం కాకపోయినా అందమైన మనసు ఉన్న వారినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మనం చేసే పనిలో మంచి ఎక్కువగా ఉంటే ఇష్టపడుతుంటారు. అదే చెడు ఎక్కువగా కనిపిస్తే దూరం పెడుతుంటారు. అందుకే మంచి పనులు చేసే వారినే ఎక్కువగా లైక్ చేస్తుంటారు.
Also Read: ప్రయాణం చేసేటప్పుడు వాంతుల సమస్య.. అయితే ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చెయ్యండి!