Homeలైఫ్ స్టైల్Cooler Cooling Tips: ఏసీ కొనే స్థాయి లేని వాళ్ళు.. కూలర్ తో ఇలా చేస్తే...

Cooler Cooling Tips: ఏసీ కొనే స్థాయి లేని వాళ్ళు.. కూలర్ తో ఇలా చేస్తే గది వేగంగా చల్లబడుతుంది

Cooler Cooling Tips: వేసవికాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటాయి. అంత వేడికి బయటే కాదు.. ఇంట్లో ఉండడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల ఒక స్థాయి దాటిన తర్వాత వేడి అధికమవుతుంది. దీనివల్ల ఇంట్లో ఉండడం కూడా ఒక రకంగా ఇబ్బంది గానే ఉంటుంది. ఉక్క పోత.. వేడి వల్ల పది నిమిషాలు కూడా ఇంట్లో కూర్చోడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు చల్లటి వాతావరణాన్ని చాలామంది కోరుకుంటారు.

ఎండాకాలంలో మనం ఉంటున్న ఇల్లు లేదా గది చల్లగా ఉండాలంటే చాలామంది ఏసి ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ ఏసీల ధరలు చాలామంది భరించలేరు. పైగా కరెంటు బిల్లుల భయం ఉండనే ఉంది. ఇలాంటప్పుడు తక్కువ ధరలో కూలర్ కొనుగోలు చేసే.. దానిని వాడితే ఉపయోగం ఉంటుంది. అయితే ఏసీ మాదిరిగా గదిని కూలర్ చల్లబరచలేదు. దీనికోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ గది చల్లగా మారలేదు.

కూలర్ అనేది నీటిని ఆవిరిచేసి చల్లని గాలిని బయటికి పంపిస్తుంది. అదే సమయంలో వేడి గాలిని పీల్చుకుంటూ ఉంటుంది. అయితే గదిలో వేడి అధికంగా ఉన్నప్పుడు కూలర్ పంపించే చల్లగాలి సరిపోదు. దానివల్ల ఎంతసేపు కూలర్ తిరిగినా సరే గది అనేది చల్లగా మారదు. ఇలాంటప్పుడు గది చల్లగా మారాలి.. అది కూడా స్వల్ప కాలంలో జరగాలంటే.. ఓపెన్ చేసిన కిటికీ లేదా తలుపు దగ్గర కూలర్ పెట్టాలి. దీనివల్ల కూలర్ స్వచ్ఛమైన గాలిని తీసుకుంటుంది. ఆ తర్వాత గది వేగంగా చల్లబడాలంటే కూలర్లు ఐస్ లేదా చల్లని నీళ్లు పోయాలి. ఫ్యాన్ ఆన్ చేసే 15 నిమిషాల ముందు పంప్ స్టార్ట్ చేయాలి. దీనివల్ల కూలింగ్ ప్యాడ్స్ సమానంగా తడిసిపోతాయి. ఫలితంగా గది అత్యంత వేగంగా చల్లగా మారుతూ ఉంటుంది. దీంతో ఏసి వేసుకున్న అనుభూతి కలుగుతుంది. ఎండాకాలంలో కూలర్లు ఉన్నవాళ్లు ఈ పని చేస్తే గదులు త్వరగా చల్లబడతాయి. అంతేకాదు ఏసీ వాడుతున్న అనుభూతి కలుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version