Visakhapatnam development latest news: విశాఖకు( Visakhapatnam) అన్ని శుభవార్తలే అందుతున్నాయి. రేపు గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. 20 ఎకరాల్లో క్యాంపస్ ప్రారంభం కానుంది. విశాఖను ఐటి హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో ఉన్న ఏపీ ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది ఇన్ఫోసిస్ కు. గతంలో శాటిలైట్ ఆఫీసును ప్రారంభించిన ఈ ఐటీ దిగ్గజ సంస్థ.. పూర్తిస్థాయి శాశ్వత క్యాంపస్ కోసం భూమి కావాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్యాబినెట్ కూడా దీనిపై చర్చించింది. రాష్ట్ర పెట్టుబడుల సమావేశాల్లో ఈ భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
* విశాఖలో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ద్వారా సుమారు 750 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా దాదాపు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయి.
* విశాఖలోని ఎండాడ ఐటి హిల్స్ లో జాతీయ రహదారికి సమీపంలో ఈ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది.
* ఇప్పటికే టి సి ఎస్, కాగ్నిజెంట్లకు ప్రభుత్వం భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా అదే తరహా కేటాయింపులు చేసింది.
* కేవలం ఇన్ఫోసిస్ మాత్రమే కాకుండా విశాఖ పరిసరాల్లో మరిన్ని ఐటి, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయిస్తోంది.
* ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు.
* అయితే మరిన్ని ఐటి సంస్థలు పెద్ద ఎత్తున విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* బెంగళూరు, హైదరాబాద్ తరహాలో విశాఖ కూడా ఐటీ నగరంగా మారనుంది.
