Aadhaar SIM Card Check: మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? తెలుసుకోండి ఇలా..

ఏపీ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద 658 సిమ్ కార్డులు తీసుకున్నట్లు టెలికాం అధికారులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ సాయంతో దానిని గుర్తించి వాటన్నింటినీ బ్లాక్ చేశారు. ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేశారు.

Written By: Srinivas, Updated On : August 12, 2023 4:37 pm

Aadhaar SIM Card Check

Follow us on

Aadhaar SIM Card Check: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొన్ని పనులు ఈజీ అవుతున్నాయి. కానీ ఇదే సమయంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. వినియోగదారుల డేటా ఆధారంగా చాలా మంది వారి పేర్ల మీదుగా వారికి తెలియకుండానే అనేక సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఇలా తీసుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అయితే ఇతరులు చేసే మోసాల వల్ల సంబంధిత వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. ఒకప్పుడు మాన్యువల్ గా ఆధార్, ఫొటో ఇతర ధ్రువపత్రాలు తీసుకొని సిమ్ కార్డు ఇచ్చేవారు. కాని ఇప్పుడు ఆన్లౌన్లోనే ఇస్తున్నారు. దీంతో చాలా మంది వినియోగదారుల డేటాను అక్రమంగా సేకరించి వారి పేరు మీదుగా సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే మన పేరుమీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? అందుకు ఏం చేయాలి? అనే విషయాన్ని పరిశీలిస్తే..

ఏపీ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద 658 సిమ్ కార్డులు తీసుకున్నట్లు టెలికాం అధికారులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ సాయంతో దానిని గుర్తించి వాటన్నింటినీ బ్లాక్ చేశారు. ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేశారు. ఒక వ్యక్తి పేరు మీద 9 మాత్రమే సిమ్ కార్డులు తీసుకునే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితి అయితే రీ వెరిఫికేషన్ కు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మనకు తెలియకుండా ఎన్ని సిమ్ లు తీసుకున్నారో మనం తెలుసుకోవడానికి చిన్న పని చేయాలి. మీ దగ్గర మొబైల్ ఉంటే అందులో tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. ఇందులో ‘బ్లాక్ యువర్ లాస్ట్ మొబైల్’ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో ‘ నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. రెండో ట్యాప్ పై క్లిక్ చేస్తే మీ 10 అంకెల మొబైల్ నెంబర్ అడుగుతుంది. దీనిని ఎంట్రీ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది.

ఈ ఓటీపీ ఎంట్రీ చేయగానే యూజర్ పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలిసిపోతుంది. ఒక వేళ మీకు తెలియకుండా, మీకు తెలియని నెంబర్లు ఉన్నట్లయితే వాటిని బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇలా మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వెంటనే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో వెంటనే తెలుసుకోండి. లేకుంటే కొందరు కొత్త నెంబర్లు తీసుకొని వాటిని దుర్వినియోగం చేయడం వల్ల మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది.