Relationship : వివాహ బంధంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఎలాంటి మనస్పర్థలు లేకుండా సంతోషంగా ఉండటంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది దీని గురించి అంతగా ఎవరి దగ్గర మాట్లాడుకోరు. శృంగారం, లైంగిక కార్యకలాపాల గురించి ఎవరి దగ్గర అయిన చర్చిస్తే తప్పుగా అనుకుంటారు ఏమోనని వీటికి కొంచెం దూరంగా ఉంటారు. కనీసం భర్తతో కూడా తన లైంగిక కోరికలు గురించి చెప్పుకోరు. ఇదిలా ఉండగా.. ప్రతి మహిళ జీవితంలో బిడ్డకు జన్మ నివ్వడం అనేది చాలా ముఖ్యమైనది. నెలల పాటు ఇబ్బంది ఎదుర్కొన్న కూడా ఒక్కసారిగా బిడ్డను చూసిన తర్వాత ఎలాంటి బాధలైనా సరే ఇట్టే మాయమైపోతాయి. అయితే డెలివరీ అయిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు పాటు ఎలాంటి పనులు చేయకూడదు. నార్మల్ డెలివరీ అయితే పర్లేదు. కానీ సిజేరియన్ అయితే కొన్ని నెలల పాటు పనులకు దూరంగా ఉండాల్సిందే. అయితే డెలివరీ తర్వాత ఎన్ని రోజుల వరకు భార్యాభర్తలు కలవకూడదని క్లారిటీగా తెలియదు. మరి ఎన్నిరోజులకు భార్యాభర్తలు కలవాలో తెలుసుకుందాం.
నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్ తర్వాత ఏ జంట అయిన కనీసం 4 నుంచి 6 వారాల వరకు లైంగికంగా దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ రోజులు వేచి ఉన్నా పర్లేదు. ఎందుకంటే డెలివరీ తర్వాత యోని చాలా సున్నితంగా, బలహీనంగా ఉంటుంది. కాబట్టి లైంగికంగా కలిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. మహిళలు గర్భం దాల్చిన తర్వాత, డెలివరీ తర్వాత స్త్రీ శరీరంలో హార్మోన్లు మార్పులు వస్తాయి. వీటివల్ల కొన్నిరోజులు లైంగికంగా దూరంగా ఉండాలి. ప్రసవం తర్వాత కొన్ని వారాల వరకు రక్తస్రావం ఉంటుంది. వీటివల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ లైంగికంగా కలవాలి అనుకుంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత కలవడం మంచిది.
డెలివరీ తర్వాత పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల లైంగిక కార్యకలాపాలపై మహిళకు ఆసక్తి తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. డెలివరీ తర్వాత హార్మోన్ల మార్పుల వల్ల లైంగికంగా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే మళ్లీ వెంటనే లైంగికంగా కలిస్తే తొందరగా ప్రెగ్నెంట్ కావచ్చు. వెంటవెంటనే ప్రెగ్నెంట్ కావడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పుట్టుకతోనే పిల్లల్లో లోపాలు వస్తాయి. ప్రతి ప్రెగ్నెన్సీకి కనీసం 12 నుంచి 18 నెలల గ్యాప్ ఉండాలని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి డెలివరీ తర్వాత వెంటనే లైంగికంగా కలవద్దు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడం మాత్రమే కాకుండా వెజీనా సమస్యలు వస్తాయి. అలాగే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. కొన్ని రోజులు ఆగి ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి. అలాగే వ్యాయామం కూడా మెల్లిగా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల డెలివరీ తర్వాత మీరు తొందరగా రికవరీ అవుతారు.