https://oktelugu.com/

Food: ప్రతిరోజు భోజనం ఎంతసేపు చేయాలి? తక్కువ టైంలో తింటే ఏమవుతుంది?

కొంతమందికి ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అప్పటి వరకు ఏం తీసుకోకపోయినా ఎంతో తిన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే.

Written By:
  • Srinivas
  • , Updated On : October 20, 2023 / 01:07 PM IST

    Food

    Follow us on

    Food: ఇప్పటి కాలం వేగంగా పరుగెడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే చాలా మంది తమ పనులు త్వరగా పూర్తి చేసుకోవడానికి స్పీడప్ చేశారు. ఇదే సమయంలో ఆహారం తినడంలోనూ గేర్ మార్చారు. అయితే పనుల్లో వేగం ఉంటే పర్వాలేదు. కానీ ఆహారంలో తొందరపాటు ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఏదైనా ఆహారం చూడగానే చాలా మందికి ఎక్కడా లేని పూనకం వస్తుంది. వెంటనే దాన్ని నోట్లో వేసుకోవాలన్న ఆత్రుత ఉంటుంది. ఈ క్రమంలో దానిని పూర్తిగా నమలకుండా మింగేస్తారు. కానీ ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే మరోసారి అలా చేయరు. ఇంతకీ ఏం జరుగుతుందంటే?

    కొంతమందికి ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అప్పటి వరకు ఏం తీసుకోకపోయినా ఎంతో తిన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే. అంతకుముందు తీసుకున్న పదార్థాల ప్రభావం జీర్ణశక్తిపై పడుతుంది. దీంతో ఆహారం సరిగా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో శరీరం శక్తిని కోల్పోయి అలసటగా మారుతుంది. అయితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా సరైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. తినే ఆహారాన్ని బాగా నమలాలి.

    కడపు ఉబ్బరం సమస్య వచ్చిన వాళ్లు జంక్ ఫుడ్ జోలికి పోకుండా పీచు పదార్థాలు ఉండే పండ్లను తీసుకోవాలి. యాంటీ యాక్సిడెంట్లు ఉన్న ఆహారం ఎక్కువతీసుకోవడం వల్ల ఎనర్జీ రావడంతో పాటు గ్యాస్ సమస్యలు దరిచేరవు. వీటితో పాటు పెరుగు, చీజ్ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో పెరుగు ఉండేలా చూసుకోవాలి. మింట్ టీ, అల్లం టీ, అనాస ముక్కలు, ఆకు కూరలు తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడొచ్చు.

    కొందరు టేస్టీ ఫుడ్ కనిపించగానే వెంటనే లాగేస్తారు. గబగబా తినేసి మింగేస్తారు. ఇలా మింగడం వల్ల ఆహారం సరైన విధంగా జీర్ణం కాకుండా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీంతో ఆ తరువాత ఏమి తినాలన్న కోరిక ఉండదు. కానీ ఆలసట ఏర్పడుతుంది. అయితే ఆహారాన్ని బాగా నమలాలి. కనీసం అరగంటసేపు నమలాలి. ఆ తరువాత పిండిపదార్థం అయ్యాకే మింగాలి. రాత్రి సమయం దాటిని తరువాత కూడా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది.