Honey: పొరపాటున అయిన ఈ పదార్థాలతో తేనె కలిపి తిన్నారో.. అంతే సంగతులు ఇక!

పొరపాటున కూడా కొన్ని రకాల పదార్థాలతో తేనెను కలిపి తినకూడదు. ఒకవేళ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి తేనెతో కలిపి తినకూడని ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 20, 2024 10:32 pm

Honey

Follow us on

Honey: తేనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఎక్కువగా వినియోగిస్తారు. పంచదార ఉపయోగించని వాళ్లు స్వీట్‌నెస్ కోసం దీనిని ఉపయోగిస్తారు. తేనె వల్ల శరీరానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తేనే ఆరోగ్యానికి మంచిదే అయిన..కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. వాటితో కలిపి తీసుకోవడం వల్ల తేనె ప్రయోజనాలు శరీరానికి అందవు. ఎక్కువ శాతం మంది తేనేను బరువు తగ్గడానికి వాడుతారు. ఉదయాన్నే వేడి నీటిలో లేదా నిమ్మరసంలో తేనెను కలిపి తాగుతారు. దీనివల్ల బరువు తగ్గుతారని భావిస్తారు. అయితే ఇలా నిమ్మకాయలో తేనెను కలిపి తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల తేనేలోని ప్రయోజనాలు బాడీకి అందవని అంటున్నారు. పొరపాటున కూడా కొన్ని రకాల పదార్థాలతో తేనెను కలిపి తినకూడదు. ఒకవేళ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి తేనెతో కలిపి తినకూడని ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కీరదోస
ఆరోగ్యానికి కీరదోస చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే తేనెతో కలిపి కీరదోసను తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కీరదోసతో కలిపి తేనెను తినవద్దు.

నెయ్యి
ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది. అయితే కొందరు నెయ్యితో టీ చేసి అందులో తేనె వేస్తారు. దీనివల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. నెయ్యిలోని పోషకాలు శరీరానికి అందవు. పొరపాటున కూడా నెయ్యిని తేనెతో కలపవద్దు.

పాల ఉత్పత్తులతో..
తేనెను పాల ఉత్పత్తులతో కలిపి అసలు తీసుకోకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. పాలతో కలిపి తేనెను తీసుకుంటే పాలలోని పోషకాలు శరీరానికి అందవు. కొన్నిసార్లు ఈ రెండింటి మిశ్రమం విషంగా కూడా మారవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలతో తేనె కలిపి తీసుకోవద్దు.

వేడి పదార్థాలు
వేడి నీరు, పాలు వంటి పదార్థాలతో కూడా తేనెను తీసుకోకూడదు. వేడి పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల తేనెలోని ఎంజైమ్‌లు ఉండవు. దీనివల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు నెయ్యికి దూరంగా ఉండండి.

సిట్రస్ పండ్లతో..
కొందరు పండ్లపై తేనె వేస్తుంటారు. అయితే సిట్రస్ పండ్లతో ఎప్పుడూ కూడా తేనె వేయకూడదని నిపుణులు అంటుంటారు. సిట్రిక్ ఆమ్లంతో తేనెతో కలవడం వల్ల రుచి మారడంతో పాటు ఆరోగ్యానికి నష్టాలను కలిగిస్తుంది. కాబట్టి సిట్రిక్ పండ్లతో అసలు తీసుకోవద్దు.

మాంసంతో కలిపి తినకూడదు
చేపలు, మాంసం, గుడ్లు వంటివి తిన్న తర్వాత లేదా కలిపి అయిన తేనె తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యాధులు రావడంతో పాటు ఎలర్జీ కూడా వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.