https://oktelugu.com/

Honda Car: కార్లు కొనేవారికి కళ్లు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ.75,000 ఆఫర్ ప్రకటించిన కంపెనీ..వెంటనే తెలుసుకోండి..

మారుతి సుజుకీ నుంచి రిలీజైన కార్లు దేశీయ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ను దృష్టిలో ఉంచుకొని కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 15, 2023 / 10:31 AM IST

    Honda Car

    Follow us on

    Honda Car: విజయదశమి అనగానే దేశంలోని చాలా మందికి ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్నవారు ఈ పండుగ సందర్భంగా తమయ సొంతూళ్లకు వస్తుంటారు. ఈ పండుగ తరువాత దీపావళి కూడా దగ్గర్లోనే ఉండడంతో అప్పటి వరకు ఎంజాయ్ చేయాలని భావిస్తారు. పండుగల సీజన్ అంటే సాధారణ వ్యక్తులకే కాకుండా కొన్ని వ్యాపార సంస్థలు హల్ చల్ చేస్తుంటాయి. తమ బిజినెస్ పెంచుకోవడానికి వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. వినియోగదారులు సైతం పండుగల సందర్భంగా కారు కొనాలని భావిస్తాయి. 2023 విజయదశమి సందర్భంగా కొన్ని కార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. దాదాపు రూ.50 వేల వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    మారుతి సుజుకీ నుంచి రిలీజైన కార్లు దేశీయ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ను దృష్టిలో ఉంచుకొని కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్ల ధరలు తక్కువ బడ్జెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో పండుగల సందర్భంగా ఈ కంపెనీ భారీ ఆఫర్లు ప్రకటించింది. మారుతి కంపెనీ ఫ్రీ -నవరాత్రి బుకింగ్ అనే ఆఫర్ ను వినియోగదారుల ముందు ఉంచింది. ఈ కంపెనీకి చెందిన ఇగ్నీస్ రూ.65,000, , బాలెనో రూ.55,000, సియాజ్ కార్లపై రూ.53,000 వరకు బెనిఫిట్స్ ను అందిస్తోంది.

    హ్యుందాయ్ కంపెనీ సైతం పండుగ సందర్బంగా వివిధ ఆపర్లతో ఆకర్షిస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఐ10 ఎన్ లైన్ మీద రూ.50,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే గ్రాండ్ ఔ నియోస్ మీద రూ.43,000, ఆరా రూ.33,000, వెర్నా రూ.25,000, అల్కజార్ రూ.25,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరో దిగ్గజం హోండా సైతం తమ ఆఫర్లతో ఆకర్షిస్తోంది. ఈ కంపెనీకి చెందిన హోండా సిటీ పై ఏకంగా రూ.75,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. అమేజ్ మీద రూ.57,00 వరకు బంఫర్ ఆఫర్లు ప్రకటించింది.

    సాధారణ రోజుల కంటే పండుగల సమయంలో ఎవరైనా కొత్త కారు కొనాలనుకుంటున్నారు. వినియోగదారుల డిమాండ్ ఉన్నప్పటికీ కార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించి ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని కార్లు ఆపర్లు ప్రకటించాయి. మరికొన్ని రోజుల్లో మిగతా కంపెనీలు సైతం ఆఫర్లు ప్రకటిస్తారన్న చర్చ సాగుతోంది.