https://oktelugu.com/

Holy Health: ఈ రంగులతో హోలీ ఆడితే ఆరోగ్యం..

హోలీ పండుగ వసంత రుతువు ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో చెట్లు చిగురిస్తాయి. ముఖ్యంగా మోదుగ పూలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. అయితే వసంత రుతువు అంటే శీతాకాలం నుంచి వేసవి కాలానికి మారే క్రమం.

Written By:
  • Srinivas
  • , Updated On : March 24, 2024 / 09:02 AM IST

    Holy natural colour

    Follow us on

    Holy Health: దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. బృందావనంలో శ్రీకృష్ణుడు గొల్ల పడుచులతో వినోదించిన పూజకు, ఈ పండుగకు కొన్నిచోట్ల సంబంధం ఉంది. పాల్గుణి పౌర్ణమి రోజున బాలకృష్ణుడిని ఊయలలో ఉంచి బుక్కాగులాల్, ఎర్రపొడి చల్లి.. పూలు వేసి పూజ చేస్తారు. దీనిని డోల జాతరగా పిలుస్తారు. డోలా అంటే ఊయల. హలీ వేడుకలు దేశంలోనే కాకుండా విదేశాల్లో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే ఈ పండుగలో పాల్గొనడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని కొన్ని విషయాలను భట్టి తెలుస్తోంది.

    సాధారణంగా కొందరు హోలీ వేడుకలకు దూరంగా ఉంటారు. రంగులు తమ శరీరంపై పడడం ద్వారా ఏదో అనారోగ్యానికి గురవుతామని భావిస్తారు. అయితే రసాయనాలు కలిగిన రంగులు చల్లుకోవడం ద్వారా కచ్చితంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ సాంప్రదాయ రంగులతో మాత్రం ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలుస్తోంది. పూర్వ కాలంలో హోలీ పండుగ సందర్భంగా కొన్ని ప్రత్యేక మైన రంగులను తయారు చేసేవారు. ఈ రంగులు శరీరంపై పోసుకోవడం ద్వారా ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేవారట. ఆ వివరాల్లోకి వెళితే..

    హోలీ పండుగ వసంత రుతువు ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో చెట్లు చిగురిస్తాయి. ముఖ్యంగా మోదుగ పూలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. అయితే వసంత రుతువు అంటే శీతాకాలం నుంచి వేసవి కాలానికి మారే క్రమం. ఈ సమయంలో వైరల్ ఫీవర్, జలుబు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. అయితే ఇవి రాకుండా ముందు జాగ్రత్తగా హోలీ పండుగలో కొన్ని ఆరోగ్యకరమైన రంగులను వాడేవారు. ఈ రంగుల్లో ఎక్కువగా మోదుగపూలు ఉండేలా చూసుకునేవారు.

    పూర్వకాలంలో కొన్ని మోదుగపూలు ఇంటికి తెచ్చి వాటిని రోట్లో వేసి దంచేవారు. ఆ తరువాత ఆ పేస్టుకు నీళ్లు కలిపి చల్లుకునేవారు. వీటితో పాటు పసుపు నీళ్లు చల్లుకునేవారు. కొన్ని ప్రాంతాల్లో దీనినే వసంతోత్సవం అని కూడా ఉంటారు. ఇలా మోదుగ పూలుతో కలిపిన నీళ్లు చల్లుకోవడం ద్వారా శరీరానికి రోగనిరోధక శక్తి అందుతుంది. అలాగే పసుపు నీళ్లు చల్లుకోవడం ద్వారా యాంటీ సెప్టిక్ లా రక్షణ ఇస్తుంది. దీంతో అప్పటి వారు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అందువల్ల రసాయనాలు కలిపిన రంగులు కాకుండా మోదుగపూలతో తయారు చేసిన రంగులతో హోలీ ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కొందరు పెద్దలు చెబుతున్నారు. అయితే కాలక్రమేణా మోదుగ పూల చెట్లు కనుమరుగు అవుతున్నాయి. దీంతో ఈ చెట్లు కనిపించడం లేదు.