HIV Prevention Measures: మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపే వ్యాధుల్లో Aqvied Immuno Defecency Syndrome (AIDS) ఒకటి. మనుషులు శారీరకంగా కలవడం కానీ.. ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే క్రమంలో ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఈ వ్యాధి బారిన పడిన వారు మరణం తప్ప చికిత్సకు మార్గం లేకుండా ఉండేది. అయితే దీనిపై అవగాహన జరిపించడంతో చాలామంది ఈ వ్యాధికి దూరమవుతున్నారు. అయినా మారుమూల ప్రాంతాల్లో అవగాహన లేని కారణంగా ఈ వ్యాధి ప్రబలుతోంది. అయితే ఇప్పటికైనా ఎయిడ్స్ వ్యాధి వస్తే సరైన చికిత్స అందుబాటులో లేదు. అయితే స్వీయ నియంత్రణ.. ఆరోగ్యకర పనులు చేయడం వల్ల కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యాధిపై ఇప్పటికి యుద్ధం చేయడానికి చాలామంది రెడీ అవుతున్నారు. తాజాగా ఓ రాష్ట్రంలో వివాహం చేసుకోవాలంటే HIV టెస్టు తప్పనిసరి అని పేర్కొంది. ఎందుకంటే?
Also Read: డయాబెటిక్ ఉన్నా పర్వాలేదు.. ఈ బిర్యానీని లొట్టలు వేసుకుంటూ తినొచ్చు..
HIV అనే వైరస్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. అయితే ఈ వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అయితే ఒకవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న కొందరు ఎక్కువగా లైంగిక సంబంధాలు ఏర్పాటు చేసుకొని వైరస్ వ్యాపించడానికి కారణమవుతున్నారు. ఇలా గోవాలో అత్యధిక కేసులో నమోదు కావడంతో ఇక్కడ ఒక నిబంధనను తీసుకొచ్చారు. పెళ్లికి ముందు హెచ్ఐవి టెస్ట్ నెగటివ్ ఉంటేనే పెళ్లికి అనుమతి ఉంటుందని నిబంధన పెట్టింది.
తాజాగా మేఘాలయ రాష్ట్రం కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. పెళ్లి చేసుకునే వారు ఖచ్చితంగా హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలని తెలిపింది. ఇటీవల రాష్ట్రంలోని తూర్పు కాశీ హిల్స్ జిల్లాలో హెచ్ఐవి కేసులు అధికమయ్యాయి. దీంతో ఈ నిబంధన తప్పదని ఆ రాష్ట్ర మంత్రి ఆంపరీన్ లింగ్డోహ్ తెలిపారు. ఇకనుంచి ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎయిడ్స్ కేసులు ఉన్న రాష్ట్రాల్లో మేఘాలయ ఆరో స్థానంలో ఉంది. అయినా కూడా హెచ్ఐవి కేసులు పెరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
Also Read: గ్లామర్ షోలో హద్దులు చెరిపేసిన రీతూ చౌదరి!
ఒకప్పుడు ఎయిడ్స్ వ్యాధి కేసులు ఎక్కువయ్యాయి. దీంతో డిసెంబర్ 1న ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా లైంగిక కలయికలో రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు. దీంతో కొంతవరకైనా వైరస్ వ్యాపించడానికి అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. కానీ చాలామంది ఏదీ పట్టించు కోవడం లేదు. దీంతో హెచ్ఐవి కేసులో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ తో పాటు మహారాష్ట్రలో అత్యధిక కేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాన నగరాల్లోని ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికైనా ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు.