Historical Methods of Detecting pregnancy: జీవితంలో ప్రతి ఆడది తల్లి కావాలని కోరుకుంటుంది. అందుకోసం సర్వస్వం అర్పిస్తుంది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పుట్టబోయే బిడ్డ కోసం అనుక్షణం తాపత్రయపడుతుంది. ప్రస్తుతం గర్భం ధరించిందో లేదో తెలుసుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. కానీ పూర్వం రోజుల్లో ఇలాంటి శాస్త్రీయ పద్ధతులు ఉండేవి కావు. దీంతో వారు నాటు వైద్యాన్ని నమ్ముకునేవారు. ఏవో కొన్ని చిట్కాలు ఉపయోగించి మహిళ గర్భవతా? కాదా? అనేది తేల్చేవారు. దీంతో అప్పటి పరీక్షలకు శాస్త్రీయత ఉండేది కాదు. ఎలాంటి ఆధారాలు కూడా ఉండవు. ఏదో నామ్ కే వాస్తేగా పరీక్షించి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసేవారు. కాలక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోవడం తెలిసిందే.

ప్రస్తుత కాలంలో కడుపులో ఉండేది ఆడ, మగ అని కూడా చెప్పేస్తున్నారు. ఎన్ని రోజులకు ప్రసవం అనే విషయం కూడా ముందే ప్రకటిస్తారు. దీంతో బిడ్డను కనేందుకు రోజులు లెక్కపెట్టుకోవడం మామూలే. కానీ పూర్వం రోజుల్లో అలా కాదు. బిడ్డ పుట్టేందుకు పట్టే సమయం కచ్చితంగా లెక్క కట్టే అవకాశం ఉండేది కాదు. దీంతో ఎప్పుడు ప్రసవం మొదలైతే అప్పుడే బిడ్డను తీసేవారు. ఇప్పుడు మాత్రం ఎలాంటి నొప్పులు లేకపోయినా సిజేరియన్ చేసి అయినా బిడ్డను తీస్తున్నారు.
Also Read: NITI Aayog- KCR: కేసీఆర్ కు కౌంటర్ కోసం ఏకంగా నీతి అయోగ్ నే దిగిందే?
పూర్వం రోజుల్లో మర్మావయవాల వద్ద ఉల్లిపాయ ఉంచే వారు. మర్నాడు తీస్తే నోటి నుంచి ఉల్లిపాయ వాసన వస్తే గర్భిణీగా గుర్తించేవారు. ఇంకా తరువాత కాలంలో మహిళ మూత్రం ఒక గిన్నెలో పట్టేవారు. అందులో తాళం చెవి వేసేవారు. తెల్లవారి గిన్నెలో తాళం చెవి అచ్చు ఉంటే ప్రెగ్నెన్సీగా భావించేవారు. 16వ శతాబ్దంలో కూడా మూత్ర పరీక్ష చేసేవారు. కానీ ఇప్పటి మాదిరి కాదు. మూత్రాన్ని ద్రాక్ష రసంలో వేసినట్లయితే పారదర్శకత కోల్పోతే గర్భిణీగా గుర్తించేవారట. మూత్రం రంగును బట్టి పుట్టే బిడ్డ ఆడ, మగ అనేది కూడా చెప్పేవారట.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ టెస్టుల్లో కొత్త పద్ధతులు వచ్చాయి. దీంతో అధునాతన పరికరాల ద్వారా గర్భస్థ పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఫలితాలు కూడా వెంటనే తెలుస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలోనే మహిళలు ప్రసవం చేసుకుంటున్నారు. అన్ని ప్రసవాలు సిజేరియన్లుగా కావడం గమనార్హం. దీంతో సాధారణ ప్రసవాలతోనే మహిళలకు ఎలాంటి సమస్యలు ఉండవని తెలిసినా వైద్యులు తమ సంపాదన కోసం సిజేరియన్లు చేస్తుండటం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రసవాలు చేస్తుండటంతో సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపాలని చెబుతున్నారు.
Also Read:AP Capital Issue: రాజధానులపై వైసీపీ కొత్త డ్రామా… రాజ్యసభలో ప్రైవేటు బిల్లు..