Himba Tribe: మనం రోజు స్నానం చేయకపోతే ఏమీ తోచదు. అలాంటిది జీవితంలో ఒక్కసారి స్నానం చేయడమంటే మాటలు కాదు. అలాంటి ఓ తెగ కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇది నిజమే. మనం పొద్దున్నే స్నానం చేయకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. మన రక్తప్రసరణ సరిగా జరగాలన్నా స్నానం చేయడమే మార్గం. అలాంటి స్నానం ఎండాకాలంలో అయితే రెండుసార్లు చేస్తాం. మిగతా కాలాల్లో ఒకసారి చేయడం అలవాటే. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే ఓ తెగ జాతి వారు మాత్రం జీవితంలో ఒక్కసారే స్నానం చేయడం విచిత్రమే. వింటుంటూనే మనకు ఏదోలా అనిపిస్తుంది కదూ. కానీ వారికి మాత్రం అదే పద్ధతి అయిపోవడం గమనార్హం.

నమీబియా దేశంలోని కునైన్ ప్రావిన్స్ లోని హింబా తెగకు చెందిన ప్రజలు జీవితంలో ఒకసారి స్నానం చేయడమే నైజం. వారు వివాహం చేసుకునేటప్పుడు మాత్రమే స్నానం చేస్తారట. బట్టలు కూా శుభ్రం చేసుకోరు. ప్రత్యేకమైన మూలికలను వేడి నీటిలో కరగబెట్టి వాటితోనే శుభ్రపరుచుకుంటారట. జీవితంలో ఒక్కసారే స్నానం చేయడం సంచలనం కలిగిస్తోంది. వీరికి ఎందుకు ఆ ఆచారం వచ్చిందో తెలియడం లేదు. మనం రోజు స్నానం చేస్తేనే శరీరం దుర్వాసన వస్తుంది. మరి వారికి ఆ భయం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: Anchor Rashmi Review: 777 చార్లీ చిత్రానికి యాంకర్ రష్మీ షాకింగ్ రివ్యూ… ఓ పెట్ లవర్ గా!
ప్రపంచంలో ఉండే వింతైన ఆచారాల్లో ఇదొకటి. మనుషులు స్నానం చేయకుండా బతకడానికి ఎలా ఇష్టపడతారు. ఒక పూట చేయకపోతేనే మనకు అసహ్యం వేస్తుంది. అలాంటిది రోజుల తరబడి స్నానం చేయకుండా ఉండటంతో వారి శరీరం వాసన రాదా? కంపరం వేయదా? అంటే సమాధానం మాత్రం దొరకదు. అది వారి ఆచారాల్లో ఒకటి అని చెబుతుంటారు .కానీ జీవితంలో స్నానం చేయకుండా ఉండటమనేది ఆశ్చర్యకరమే.
మగవారు మాత్రం వారికి పెళ్లి అయిందనేదానికి గుర్తుగా తలపాగా ధరిస్తారట. జీవితంలో ఆ తలపాగా తీయకుండా ఉంటారట. వారి ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా స్నానం చేయకపోవడమనేది మాత్రం అందరిలో అనుమానాలకు తావిస్తోంది. జీవితాంతం అలాగే ఉండటం సాధ్యం కాదని మనకు తెలిసినా వారు మాత్రం ఉండగలగడం మాత్రం యాదృచ్ఛికమేమీ కాదు. అది వారి జీవితంతో ముడి పడి ఉన్న ఆచారంగా తెలుస్తోంది. అందుకే వారు జీవితంలో పెళ్లి జరిగేటప్పుడు మాత్రమే స్నానం చేయడం పరిపాటి.
Also Read: Sreemukhi Remuneration: శ్రీముఖి రోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా? మైండ్ బ్లాక్ కావాల్సిందే?
[…] […]
[…] Also Read: Himba Tribe: జీవితంలో వాళ్లు ఒక్కసారే స్నానం… […]