Himalayan Herbe: హిమాలయాల్లో ఎన్నో కొత్త రకాల వస్తువులు కనిపిస్తాయి. అవి మొక్కలు, మూలికలు, పువ్వులు ఇలా చాలా కూడా కొత్తవి కనిపిస్తుంటాయి. అయితే ఓ అరుదైన మూలికలు కేవలం హిమాలయాల వంటి ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే లభిస్తాయి. అవే హిమాలయన్ హెర్బ్. దీన్ని కీడా జాడి, హిమాలయన్ వయగ్రా అని కూడా అంటారు. ఇది హిమాలయాల్లో 3000 మీటర్ల ఎత్తులో లభిస్తుంది. పాటింగ్ గ్లేసియర్ ప్రాంతం, లాస్పా, బర్ఫు, రలం, నాగిధుర, మహోర్పన్, దర్తీ గ్వార్, చిప్లకేదర్, దర్మా వ్యాలీ, వ్యాస్ వ్యాలీ, చమోలి, ఉత్తర కాశీలోని ఎత్తైన ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీన్ని దీర్ఘకాలిక వ్యాధులు అయిన క్యాన్సర్‌కు కావాల్సిన మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం దీనికి మంచి డిమాండ్ ఉంది. కేవలం ఇండియాలోనే కాకుండా చైనా, సింగపూర్, హాంకాంగ్‌లో కూడా ఉంది. ఈ హిమాలయన్ హెర్బ్ ధర విదేశాల్లో మంచి రేటు పలుకుతుంది. దీని కేజీ ధర దాదాపుగా ధర రూ.50 లక్షలు ఉంటుందట.
ఈ హిమాలయన్ హెర్బ్ గొంగలి పురుగు నుంచి వస్తుంది. దీని పొడిని పాలు లేదా నీటిలో అయిన కలిపి కషాయంలా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకి ఒకసారి కాకుండా రెండు సార్లు తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె సమస్యలు, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం వంటివి రాకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులోని పోషకాలు లైంగిక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. కొన్ని దేశాలు పురుషుల లైంగిక శక్తిని పెంచడానికి కావాల్సిన ఔషధాలను ఈ హిమాలయన్ హెర్బ్‌తో తయారు చేస్తారు.
కీడా జడి అనేది ఒక పరాన్న జీవి శిలీంద్రం. ఇది లెపిడోప్టెరా అనే లార్వాపై వృద్ధి చెందుతుంది. ఈ ఫంగస్.. గొంగళి పురుగులను చంపి మళ్లీ పునరుత్పత్తి చెందుతుంది. దీనికి ఉన్న డిమాండ్ కారణంగా కొందరు ఈ ఫంగస్‌ను అక్రమంగా పెరిగేలా చేస్తున్నారు. పుట్ట గొడుగులను ఎలా పెంచుతున్నారో.. అలాగే హిమాలయన్ హెర్బ్‌ను కూడా పెంచుతున్నారు. దీన్ని అక్రమంగా సాగు చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరం. ఈ విషయం తెలిసిన కూడా చాలా మంది దీని డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అక్రమంగా సాగు చేస్తున్నారు. ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగపడే ఈ ఫంగస్ ప్రపంచంలోనే చాలా ఖరీదైని. అందుకే దీనికి ఎక్కువగా డిమాండ్ ఉంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉండటంతో రోజురోజుకీ దీని డిమాండ్ పెరుగుతోంది. కానీ ఈ జాతి త్వరగా అంతరిస్తోంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.