Health Tips: ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు తప్పకుండా త్రాగాలి. దీనిద్వారా అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి ఈ నీళ్లు బాగా సహాయపడతాయి.

ఇక, భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ కూడా ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది
స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ కూడా చాలా మంచిది. మీకు తెలుసా ? రక్తపోటును తగ్గించడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా మంచిది.
Also Read: రేవంత్ లాబీయింగ్ పనిచేసిందే.. కాంగ్రెస్ లోకి డీఎస్.. వ్యతిరేకిస్తున్న సీనియర్లు
రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ కూడా చాలా మంచిది. స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
అదనంగా, రాత్రి మధ్యలో నీరు తాగితే.. రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి ఈ నీరు సహాయపడుతుంది.
కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. కాబట్టి రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.
పకృతి మనకు ప్రసాదించిన గొప్ప వనరు నీరు. నీరు కరెక్ట్ టైంలో కరెక్టుగా తాగిన మీకు ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అసలు సమస్యలే రావు. ఎందుకంటే.. చాలా రోగాలకు నీటితో సంబంధం ఉంది. కాబట్టి.. ప్రతి ఒక్కరూ అసలు నీళ్ళు ఎలా తాగాలో నేర్చుకోవలసిన అవసరం ఉంది.
Also Read: ప్రెషర్లకు విప్రో అదిరిపోయే శుభవార్త.. రూ.29,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?
[…] NTR: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ సినిమా చేయబోతున్నాడు. పైగా ఆర్ఆర్ఆర్ వల్ల ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. అయితే.. జక్కన్న సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పుడు కొరటాలతో మూవీ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. కాగా హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. […]