Vastu Tips: జీవితం బాగుండాలంటే వాస్తు బాగుండాలి అని నమ్ముతుంటారు కొందరు. వాస్తు బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటే ఇంట్లో ఉన్నవారు బాగుంటారని నమ్మకం. ఇక ఈ వాస్తు శాస్త్రం ప్రకారమే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే చాలా మంది ఇల్లు కడుతున్నప్పుడు కచ్చితంగా వాస్తు చూస్తుంటారు. వాస్తు ప్రకారమే ఇల్లు కడుతుంటారు. కొన్ని సార్లు ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు అనుకుంటారు. ఇదిలా ఉంటే వాస్తు ప్రకారం మనం చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం నీరు, గాలి, అంతరిక్షం, అగ్ని భూమి అనే ఐదు అంశాల మధ్య సమతుల్యతను కొనసాగించాలి. ఈ అంశాలు మన జీవితాలను ప్రభావితం చేసే విశ్వ శక్తులను సూచిస్తాయి. జీవితం సాఫీగా సాగేందుకు కొన్ని వాస్తు సూచనలు ఉన్నాయి. వాటిలో ఉత్తర ద్వారం వద్ద చేయాల్సిన ఒక పని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని ఉంచండి. ఈ రేఖాగణిత సాధనం కుబేరుడిని సూచిస్తుంది కాబట్టి అమర్చడం వల్ల మంచి జరుగుతుంది. ఇక సానుకూల శక్తిని అభివృద్ధి చేయడంలో, తగిన రంగులను ఉపయోగించడం కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి.
ఇంట్లో పసుపు, నారింజ, ఎరుపు వంటి ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించండి. ఇవి సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి. గోడల విషయంలో నలుపు, బూడిద రంగులను అసలే వాడకండి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని వ్యాప్తి చేయడంలో ఎక్కువ పాత్రను పోషిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు శుభ్రంగా ఉంటే అందులోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి చెత్త వేయకండి. ప్రకృతిలో భాగమైన పువ్వులు, పండ్లు, పక్షులు మొక్కల చిత్రాలతో మీ ఇంటిని అలంకరించండి. కత్తులు లేదా ఇతర పదునైన ఆయుధాల చిత్రాలను ఇంట్లో ఉంచవద్దని గుర్తుంచుకోండి. ఇవి ఉండే స్థానంలో ప్రతికూల లేదా దుష్ట శక్తులు చురుకుగా ఉంటాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. నిర్దిష్ట సమాచారం కోసం నిపుణులను సంప్రదించవలెను. వీటికి మన వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.