Heavy Sweat: అధికంగా చెమట పడుతోందా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే!

చెమట ఎక్కువగా పట్టడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. ఇలా ఎక్కువగా చెమట పడుతుంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని సందేహ పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 15, 2024 8:14 pm

sweat

Follow us on

Heavy Sweat: సాధారణంగా ఎవరికైనా వేసవి కాలంలో ఎక్కువగా చెమట వస్తుంది. మిగతా కాలాల్లో ఎక్కువగా ఎండలో పనిచేయడం, గ్యాప్ లేకుండా పని చేయడం వల్ల చెమట పడుతుంది. కానీ కొందరికి సీజన్‌తో సంబంధం లేకుండా ఎక్కువగా చెమట పడుతుంటుంది. బాడీ వల్ల అలా చెమట పడుతుందని భావించి లైట్ తీసుకుంటారు. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా కష్టపడితే, లేకపోతే వేడి వల్ల చెమట పడితే పర్లేదు. కానీ ఎల్లప్పుడూ అధికంగా చెమట పడుతుందంటే కాస్త జాగ్రత్త పడాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చెమట ఎక్కువగా పట్టడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. ఇలా ఎక్కువగా చెమట పడుతుంటే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని సందేహ పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

 

శరీరం నుంచి చెమట వస్తుంటే ఈజీగా తీసిపారేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొందరికి చెమట ఎక్కువగా పడుతుంటే హైపర్ హైడ్రోసిస్ అనే వ్యాధికి దారితీస్తుందట. ఇది చెడు వాసన ఉన్న ఒక వ్యాధి. ఇలా ఎక్కువగా చెమట వస్తుంటే దానికి చెడు వాసన ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా ఎక్కువగా వాసనతో కూడిన చెమట వస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వ్యాధితో బాధపడేవారు అధికంగా చెమటను అనుభవిస్తారు. అండర్ ఆర్మ్స్, అరచేతులు, ముఖం, అరికాళ్లు వంటి శరీర భాగాలలో అధికంగా చెమట ఉంటుంది. చల్లని వాతావరణంలో కూడా చెమట అధికంగా వస్తుంది. కొందరు చెమట ఎక్కువగా ఉంటే స్నానం చేయడం, లూజుగా ఉండే దుస్తులు ధరించడం, సెంట్లు కొట్టడం వంటివి చేస్తారు. కానీ ఫలితం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

చెమట అధికంగా రావడం వల్ల ఇదే కాకుండా మిలేరియా అనే వ్యాధి కూడా వస్తుందట. వేసవిలో సాధారణంగానే చెమట ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఇంకా ఎక్కువగా చెమట వస్తోంది. చెమటతో పాటు చిన్న పొక్కులు కూడా అవుతాయి. చేతులు, కాళ్లు, ఛాతీ, పొట్టపై చెమట బొబ్బలు ఎక్కువగా కనిపిస్తాయి. చెమట కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ బాడీపై ఉండిపోతాయి. వీటిని తగ్గించడానికి ఎన్నిసార్లు స్నానం చేసిన తొలగిపోవు. కొందరు ఒంటి మీద బ్యాక్టీరియా పోవాలని ఓ తెగ స్నానం చేసేస్తారు. కానీ అలా అనుకోవడమే కానీ.. బ్యాక్టీరియా ఒంటిపైన ఉండిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చెమట గ్రంథుల్లో సెబమ్ ఉంటుంది. దీనివల్ల చర్మం నల్లగా మారడం, మెడ, చంకలు, జననేంద్రియ ప్రాంతాలు కూడా నల్లగా మారుతాయి. అయితే ఈ అధిక చెమట రావడానికి ముఖ్య కారణం మెనోపాజ్, హైపర్ థైరాయిడిజం వంటివని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.