https://oktelugu.com/

Heart Attack: గుండె ప్రమాదాలకు చెక్ పెట్టాలంటే.. ఈ జ్యూస్ తాగాల్సిందే!

గుండె పోటు సమస్య నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా డైట్‌లో ఈ జ్యూస్ తప్పకుండా చేర్చుకోవాలి. మరి గుండె పోటు నుంచి విముక్తి చెందాలంటే డైట్‌లో చేర్చుకోవాల్సిన జ్యూస్ ఏంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 27, 2024 8:54 pm
    Heart-changes

    Heart-changes

    Follow us on

    Heart Attack: ప్రస్తుతం మారిన జీవన శైలి, తీసుకునే ఆహారం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎక్కువగా గుండె ప్రమాదాల బారిన పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఈ గుండె పోటు మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె పోటు వచ్చి ఒక్కసారిగా చనిపోతున్నారు. ఏదో పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేల మీద పడిపోతున్నారు. కొందరు జిమ్ చేస్తూ, మరికొందరు క్లాస్ రూమ్‌లో చదువుకుంటూ, డ్యాన్స్ వేస్తూ ఇలా తమ పనులు చేస్తూనే ఒక్కసారిగా గుండె పోటుతో మరణిస్తున్నారు. అయితే ఈ గుండె పోటు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే ఈ గుండె పోటు ప్రమాదాలు ఇంకా పెరుగుతాయి. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ముఖ్యంగా డైట్‌లో ఈ జ్యూస్ తప్పకుండా చేర్చుకోవాలి. మరి గుండె పోటు నుంచి విముక్తి చెందాలంటే డైట్‌లో చేర్చుకోవాల్సిన జ్యూస్ ఏంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

     

    గుండె పోటు వచ్చే ప్రమాదాల నుంచి బయట పడాలంటే యాపిల్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. యాపిల్‌లో ఐరన్, ఫాస్పరస్, పీచు, పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం ఇలా ఒకటేంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పోటు వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. చాలా మంది యాపిల్‌ను ముక్కలుగా కట్ చేసి తింటారు. జ్యూస్ చేసుకుని తాగేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. యాపిల్ జ్యూస్‌లో దాదాపు 88 శాతం నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. యాపిల్‌లో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీర కణాలను మంట, ఆక్సీకరణం నుంచి రక్షిస్తుంది. ఇది ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి విముుక్తి కల్పించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయట పడనిస్తుంది. అయితే కొందరు యాపిల్ జ్యూస్ తయారు చేసేటప్పుడు తొక్క తీసేస్తారు. ఇలా తాగడం వల్ల అందులోని పోషకాలు అసలు శరీరానికి అందవు. కాబట్టి ఎప్పుడు కూడా యాపిల్స్‌ను తొక్కతోనే జ్యూస్ చేయాలి.

     

    యాపిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొందరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారికి యాపిల్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాపిల్‌లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కొందరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారికి యాపిల్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పీచు ఆకలి కోరికలను తగ్గిస్తుంది. దీంతో తొందరగా బరువు తగ్గుతారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా యాపిల్ జ్యూస్‌ను కనీసం వారానికొకసారి అయిన తాగడం అలవాటు చేసుకోండి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.