Heart Attack: ఈ రోజుల్లో చాలా మంది శారీరక శ్రమకు అసలు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో ఎక్కువగా కూర్చోని ఉంటున్నారు. ఎలాంటి వ్యాయామం చేయకుండా కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొంటున్నారు. దీనివల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా శారీరక శ్రమ ఉండాలి. కొందరు కనీసం వాకింగ్ వంటివి కూడా చేయరు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది వాళ్ల బిజీ లైఫ్ వల్ల అసలు వ్యాయామం చేయడం లేదు. వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. అందరూ కూడా సుఖానికి అలవాటు పడి కనీసం శారీరకంగా వ్యాయామం కూడా చేయడం లేదు. ఎక్కువగా కూర్చోని ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
కదలకుండా ఒకే ప్లేస్‌లో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా కదలకుండా కూర్చోకుండా శారీరకంగా చురుకుగా ఉండాలి. శారీరక శ్రమ చేసే వారితో పోలిస్తే.. చేయని వారిలో గుండె జబ్బుల ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలోని కండరాలు కొవ్వును కరిగించలేవు. దీనివల్ల పూర్తిగా రక్తప్రసరణ మందగిస్తుంది. దీంతో గుండెలోని రక్తనాళాల్లో రక్తం కాకుండా కొవ్వు ఉంటుంది. దీంతో గుండె జబ్బులు వస్తాయి. ఇవే కాకుండా కదలకుండా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె పోటు సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీటి నుంచి విముక్తి పొందాలంటే తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి.
ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం వల్ల మలబద్ధకం, పైల్స్, కొలెస్ట్రాల్ పెరగడం, మధుమేహం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి అలా కదలకుండా కూర్చోకూడదు. కనీసం 45 నిమిషాలకు ఒకసారి అయిన కూడా లేచి నిల్చోవాలి. ఇలా చేయడం వల్ల కాస్త ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే యోగా, మెడిటేషన్, వ్యాయామం అన్ని చేయాలి. ఇలా చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే తొందరగా దీర్ఘకాలిక సమస్యల బారిన పడి ఇబ్బంది పడుతుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.