Heart Attack : ఛాతీలో నొప్పి వస్తే చాలు గుండెనొప్పి అనుకుని గాబారా పడిపోతాం. ఈ విధంగా ఎప్పుడు రాలేదు కదా అని టెన్షన్ తో మరింత భయానికి లోనవుతాం. అయితే ఈ నొప్పి రాగానే గ్యాస్ సమస్యనా? లేక గుండెనొప్పా అనేది మనకు ఆ సమయంలో అర్థం కాదు. ఇటువంటి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు వైద్య నిపుణులు.
ఛాతీలో నొప్పి క్రమంగా ఎడమ చేతికి వస్తే గుండెనొప్పిగా భావించవచ్చని తెలుస్తోంది. గ్యాస్ కారణంగా వచ్చిందా లేక మరే ఇతర కారణమా అని తెలియని పక్షంలో.. గుండె నొప్పి అని అనుమానం వస్తే కనుక వెంటనే 75 మిల్లీ గ్రాముల ఆస్ఫ్రిన్ టాబ్లెట్స్ నాలుగు ఒకేసారి వేయాలని, వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వలన కానీ, కొవ్వు పదార్థం వలన రక్త ప్రసరణ తగ్గినప్పుడు లేదా రక్తనాళాలు పూడుకుపోవడం వంటి తదితర కారణాల వలన గుండెనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత జీవన శైలిలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా కూడా గుండెనొప్పికి గురయ్యే అవకాశం ఉంది.
గుండెనొప్పి అయితే ఛాతీతో పాటు ఎడమ చెయ్యితో పాటు ఎడమ వైపు వెనుకభాగంలోనూ నొప్పి అనిపిస్తుంది. అలాగే ఛాతీ భాగం బరువుతో కూడిన నొప్పిని కలిగిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అలాగే కడుపులో తీవ్రమైన నొప్పి, శరీరం మొరాయిస్తున్నట్లుగా అనిపించడం, చాలా అలసటగా ఉండటం, గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించినా గుండెనొప్పి లక్షణాలుగా భావించవచ్చు. ఇటువంటి లక్షణాలను ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదని డాక్టర్లు తెలుపుతున్నారు. అయితే సంతులిత ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.