Mobile Side Effects: ఆ ఫోన్లు వాడితే గుండెనొప్పి ఖాయం.. ఆధారాలు ఇదిగో

ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ట్ ఎటాక్ రావడం కామన్ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పి వస్తుంది. ఈ సమస్యకు కారణం ఏదైనా ఒత్తిడి అనేది ప్రధానంగా ఉంటుంది అని అంటున్నారు కొందరు వైద్యులు.

Written By: Chai Muchhata, Updated On : January 16, 2024 10:50 am

Mobile Side Effects

Follow us on

Mobile Side Effects: ఉదయం అలారం మోగినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి వ్యక్తికి ఉండే ఒకే ఒక్క తోడు మొబైల్. ఫోన్ లేకుండా ఈ రోజుల్లో ఏ పని సాధ్యం కాదనే చెప్పవచ్చు. స్కూల్ కెళ్లే విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ మొబైల్ లో లింక్ అయ్యే ఉంటున్నారు. అయితే ఈ రోజుల్లో మొబైల్ వాడకం మరీ ఎక్కువైంది. అవసరాలతో పాటు కాలక్షేపానికి కూడా మొబైల్ ను యూజ్ చేయడంతో జీవితంలో ఇదొక పార్ట్ గా మారింది. మొబైల్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని ఇప్పటి వరకు వివిధ మార్గాల ద్వారా చెబుతున్నారు. కానీ తాజాగా తేలిన విషయమేంటంటే కొన్ని మొబైల్స్ వాడడం వల్ల హార్ట్ ఎటాక్ రావడం కన్ఫామ్ అని అంటున్నారు. అందుకు కారణం ఏంటంటే?

ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ట్ ఎటాక్ రావడం కామన్ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పి వస్తుంది. ఈ సమస్యకు కారణం ఏదైనా ఒత్తిడి అనేది ప్రధానంగా ఉంటుంది అని అంటున్నారు కొందరు వైద్యులు. చిన్న పిల్లలు సైతం కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల గుండెపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో 10 ఏళ్ల లోపు వారు సైతం గుండెపోటుతో మరణించిన వారి గురించి విన్నాం. అయితే తాజాగా ఈ మొబైల్స్ వాడితే మాత్రం హార్ట్ ఎటాక్ ను కోరి తెచ్చుకున్నట్లేనని అంటున్నారు.

సాధారణంగా ఒక మొబైల్ ను కనీసం 3 సంవత్సాలు వాడుతూ ఉంటాం. కానీ బ్రాండెడ్ మొబైల్స్ ను ఎక్కువ కాలం పాటు యూజ్ అయ్యేఛాన్ష్ ఉంది. దీంతో కొత్త మొబైల్ కొనడం ఇంట్రెస్ట్ లేనివాళ్లు పాత దానితోనే మెయింటేన్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఎంతో ప్రమాదకరమని అంటున్నారు. ఒక ఫోన్ ను 5 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు వాడితే గుండెనొప్పి రావడం కన్ఫామ్ అని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం సైతం త్వరలో కొన్ని ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఒక ఫోన్ 5 సంవత్సరాల తరువాత వాడితే ప్రమాదమని ఎలా తెలుసుకోవాలి? దానికున్న ట్రిక్ ఏంటీ?

ఇందు కోసం మొబైల్ *#7అని టైప్ చేయాలి. ఇలా చేసిన తరువాత SAR అనే పేరుతో ఒక మెసేజ్ వస్తుంది. ఇందులో 1. 258W/Kg@1g(Head), o.482W/Kg@1g(Body) అని డిస్ ప్లే అవుతుంది. ఇది 1.6W/Kg కంటే తక్కువగా ఉంటే ఆ ఫోన్ యూజ్ చేస్తున్నవారు డేంజర్లో ఉన్నట్లే. దానిని యూజ్ చేస్తే హార్ట్ ఎటాక్ రావడం ఖాయం అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది మెదడుపై ప్రభావంకూడా చూపుతుందని అంటున్నారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు ఫోన్ యూస్ చేస్తే ఆ ఫోన్ లో 1. 7W/Kg అని వస్తుందని అంటున్నారు. అందువల్ల ఇలాంటి మొబైల్స్ ను సాధ్యమైనంతవరకు దూరం పెడితేనే మంచిది. లేకుంటే ప్రమాదం ఖాయం..