https://oktelugu.com/

Hear Health: చెవికి మసాజ్ చేయడం లేదా.. వామ్మో ఎంత ప్రమాదమో!

ప్రస్తుతం రోజుల్లో అయితే ఎక్కువగా పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి ఇయర్ బడ్స్ వంటివి వాడుతున్నారు. వీటిని తక్కువ సమయం కాకుండా ఎక్కువ సమయం ఉపయోగిస్తున్నారు. ఇలా రోజంతా పెట్టుకోవడం వల్ల చెవులు దెబ్బతింటాయి. మరి ఇలాంటి సమయాల్లో తప్పకుండా జాగ్రత్త వహంచాలని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2025 / 11:34 PM IST

    Hearing Problems

    Follow us on

    Hear Health: జ్ఞానేంద్రియాల్లో భాగమైన చెవులు ప్రతీ మనిషికి ముఖ్యమే. ఎందుకుంటే ఇతరులు చెప్పేది వినాలంటే తప్పకుండా చెవులు పనిచేయాలి. ఇవి పనిచేయాలంటే వీటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా అందరూ కూడా కళ్లు, చేతులు, చర్మం విషయంలో జాగ్రత్త వహిస్తారు. కానీ చెవుల విషయంలో అసలు జాగ్రత్త వహించరు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఎక్కువగా పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి ఇయర్ బడ్స్ వంటివి వాడుతున్నారు. వీటిని తక్కువ సమయం కాకుండా ఎక్కువ సమయం ఉపయోగిస్తున్నారు. ఇలా రోజంతా పెట్టుకోవడం వల్ల చెవులు దెబ్బతింటాయి. మరి ఇలాంటి సమయాల్లో తప్పకుండా జాగ్రత్త వహంచాలని నిపుణులు చెబుతున్నారు. బాడీకి ఎలా మసాజ్ చేస్తారో.. చెవులకు కూడా అప్పుడప్పుడు మసాజ్ చేయాలట. అలా చేయడం వల్ల చెవి లోపల ఉన్న మురికి అంతా పోతుంది. కనీసం వారానికి ఒకసారి అయిన కూడా చెవిని క్లీన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అయితే వీటిని ఎలా క్లీన్ చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

    సున్నితమైన భాగాల్లో చెవి ఒకటి. దీనికి అప్పుడప్పుడు మసాజ్ చేయాలి. చెవులను శుభ్రం చేసుకోవడానికి క్లినిక్‌లు ఉంటాయి. అక్కడికి వెళ్లి క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల చెవిలో రక్త ప్రవాహాం మెరుగుపడుతుంది. దీనివల్ల కణజాలాలకు మెరుగైన ఆక్సిజన్ కూడా అందుతుంది. అలాగే నొప్పి నుంచి ఉపశమనం, మెడ, భుజాలలో తలనొప్పి తగ్గడం కూడా జరుగుతుంది. చెవికి బాడీలోని కొన్ని పాయింట్లకు లింక్ ఉంటుంది. ఇవి ఒత్తిడి, అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సాధారణంగా అయిన మీరు చెవులను వారానికి ఒకసారి అయిన క్లీన్ చేసుకోవాలి. కొందరు వేలితో క్లీన్ చేస్తుంటారు. ఇలా చేయకుండా ఇయర్‌బడ్స్‌తో క్లిన్ చేసుకోవాలి. లేకపోతే చెవిలో మురికి పెరిగిపోయి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దీనివల్ల మీకు చెవి నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పి నుంచి విముక్తి పొందాలంటే చెవిలో నూనె వేసి కూడా శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నూనె వేయడం వల్ల చెవిలో ఉన్న మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తాది. మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. దీనివల్ల మీకు చెవి సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. రోజూ ఉదయం లేచిన వెంటనే చెవి మసాజ్‌ని రోజువారీ దినచర్యలో చేర్చితే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. దీంతో మీరు హాయిగా నిద్రపడుతుంది. అయితే చెవిలో గోరువెచ్చని నూనె వేయాలని నిపుణులు అంటున్నారు. కొబ్బరి, ఆలివ్, దినుసుల నూనెను ఎక్కువగా వేస్తుంటారు. ఇలా చేస్తే తక్షణమే చెవి సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. కొందరు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా వేస్తుంటారు. అయితే వైద్య సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.