https://oktelugu.com/

Healthy: వందేళ్లు జీవించాలంటే.. పాటించాల్సిన అలవాట్లు ఇవే!

ఈ రోజుల్లో ఎక్కువగా గంజాయి, మద్యం వంటి వాటికి బానిస అవుతున్నారు. వీటిని అధికంగా సేవించడం వల్ల ఎక్కువ రోజులు జీవించాల్సిన వాళ్లు కూడా తొందరగానే చనిపోతున్నారు. మరి వందేళ్ల పాటు సంతోషంగా జీవించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2024 / 04:44 PM IST

    healthy

    Follow us on

    Healthy: ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా వందేళ్లు జీవించాలని చాలా మంది కోరుకుంటారు. దీనికోసం ఆహార విషయంలోనే కాకుండా మిగతా విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఉదయాన్నే లేచి వాకింగ్ చేసి, సరిగ్గా నిద్రపోయి, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. అయితే ఈరోజుల్లో ఉండే జీవనశైలి వల్ల చాలా మంది 50 ఏళ్లకే చనిపోతున్నారు. ఇంకా కొందరు అయితే గుండె పోటు వంటి సమస్యలతో ఏకంగా చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఫుడ్, అలవాట్లు అయితే మార్చాలి. మనలో చాలామందికి ఎలాంటి నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారో కూడా తెలియదు. ఈ రోజుల్లో ఎక్కువగా గంజాయి, మద్యం వంటి వాటికి బానిస అవుతున్నారు. వీటిని అధికంగా సేవించడం వల్ల ఎక్కువ రోజులు జీవించాల్సిన వాళ్లు కూడా తొందరగానే చనిపోతున్నారు. మరి వందేళ్ల పాటు సంతోషంగా జీవించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఆరోగ్యకరమైన ఆహారం
    అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మొదట చేయాల్సిన పని ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం. పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడరు. ముఖ్యంగా పప్పులు, పాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు ఇలా పోషకాలు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, బాగా వేయించిన ఫుడ్ వంటివి అసలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీంతో తొందరగా మరణిస్తారు. కాబట్టి పండ్లు, గింజలు, సోయాబీన్స్ వంటివి పుష్కలంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా వందేళ్ల పాటు జీవిస్తారు.

    మద్యం సేవించకూడదు
    ఈ రోజుల్లో చాలా మంది చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ఎక్కువగా మధ్యపానం, ధూమపానం వంటివి సేవిస్తున్నారు. దీనివల్ల తొందరగా మరణిస్తున్నారు. వీటిని సేవించడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ చెడు అలవాట్లు మీ జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. వీటిని సేవించకపోతే తప్పకుండా వందేళ్ల పాటు సంతోషంగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారు.

    శరీరానికి సరిపడా నిద్రపోవాలి
    ఆరోగ్యమైన జీవితానికి ఫుడ్ ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజూ ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వందేళ్ల పాటు సంతోషంగా జీవించాలంటే బాడీకి సరిపడా నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. నిద్ర తక్కువగా ఉన్నవారు తొందరగా చనిపోతారని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా జీవించండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.