Health Tips: రోజు మొత్తంలో అల్పాహారం(Tiffin) చాలా ముఖ్యమైనది. పొరపాటున మధ్యాహ్నం లేదా రాత్రి సమయాల్లో భోజనం(Food) చేయకపోయినా పర్లేదు. కానీ ఉదయం టిఫిన్(Tiffin) మాత్రం అసలు మానకూడదు. అల్పాహారం మానడం వల్ల అనారోగ్య సమస్యలతో(Health Issues) ఇబ్బంది పడతారు. ఉదయం పూట టిఫిన్ చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కాబట్టి పోషకాలు ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్(Fiber), ప్రొటీన్(Protien) ఎక్కువగా ఉండే వాటిని ఉదయం సమయంలో తీసుకుంటే డే అంతా కూడా యాక్టివ్‌గా(Active) ఉంటారు. కొందరు ఉదయం సమయాల్లో ఎక్కువగా ఆయిల్ ఫుడ్(Oil Foods) వంటివి తీసుకుంటారు. ఇవి శరీరానికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అయితే ఉదయం సమయాల్లో ప్రొటీన్ రిచ్(Protien Rich) ఎక్కువగా ఉండే కొన్ని ఫుడ్స్‌ను యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
చియా పుడ్డింగ్
ఆరోగ్యానికి చియా గింజలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఆరోగ్యమైన కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా శరీరానికి బాగా ఉపయోగపడతాయి. డైలీ ఉదయాన్నే వీటిని తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
గుడ్లు
గుడ్లులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కండరాలు బలంగా ఉండేలా తయారు చేస్తాయి. రోజూ ఉదయం ఆమ్లెట్ లేదా ఉడికించిన కోడి గుడ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. గుడ్లలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ అన్ని ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
అవోకాడో
అవోకాడోలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయం టిఫిన్‌గా తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. వీటితో పాటు ఓట్స్ కూడా తీసుకోవాలి.
కాటేజ్ చీజ్
కాటేజ్ చీజ్‌లో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. డైలీ వీటిని అల్పాహారంగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
క్వినోవా
క్వినోవా రైస్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రైస్‌ను ఉదయం సమయాల్లో తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిని తినడం వల్ల కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. దీంతో బయట ఫుడ్ ఎక్కువగా తినకపోవడం వల్ల బరువు తగ్గుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.