Health Tips : వాతావరణం మార్పుల్లో భాగంగా మార్చి నుంచి వేసవి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. దీంతో మనుషుల శరీరాల్లోనూ కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. చల్లటి వాతావరణంలో తీసుకున్న కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే వేసవి మొత్తం కొన్నింటిని తీసుకోకుండా ఉండాలి. అలాంటి ఫుడ్స్ ఏవో చూద్దాం..
వేసవి అనగానే వాతావరణం వేడెక్కుతుంది. దీంతో చాలా మంది చల్లదనం కోరుకుంటారు. ఈ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే కొందరు కారం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా దీసుకోవడం వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తాయి. కుడుపు ఉబ్బరంగా ఉండి అలసట ఏర్పడుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగా స్పైస్ ఫుడ్ ను అవైడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు అవితీసుకోకుండా ఉండడమే మంచిది.
వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం చేసే ద్రవపదార్థాలు తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం తేమ కోల్పోయిన నిర్జీవంగా తయారై అనారోగ్యం ఏర్పడవచ్చు.
మాంసాహారం అనగానే చాలా మంది లొట్టలేసుకొని తింటారు. వేసవిలో ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి జీర్ణక్రియను మందగించడమే కాకుండా ఒక్కోసారి కడుపులో సమస్యలు వచ్చి విరేచనాలు రావొచ్చు. అలాగే వేపుళ్లు, పచ్చళ్లను సైతం ఈ కాలంలో అవైడ్ చేయాలి. వీటికి బదులు పెరుగన్నం, తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. లేకపోతే అనేక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.